Friday, September 20, 2024
HomeఆటThalasani: పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ కు అభినందన

Thalasani: పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ కు అభినందన

కేరళలో జరిగిన 2023 ఏషియన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో 105 కిలోల విభాగంలో సనత్ నగర్ కు చెందిన రవి సింగ్ బిద్లాన్ బంగారు పతకాన్ని సాధించారు. ఈ పోటీలలో 12 దేశాలు పాల్గొనగా భారతదేశం తరఫునుంచి తెలంగాణ స్టేట్ లో సనత్ నగర్ కు చెందిన రవి సింగ్ బిద్లాన్ పాల్గొని బంగారు పతకాన్ని సాధించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను తన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి ఏషియన్ పవర్ లిఫ్టింగ్ లో బంగారు పతాకం సాధించి ఇప్పటి వరకు ఎవరు కూడా తీసుకురాని ఏషియన్ టైటిల్ స్ట్రాంగ్ మెన్ బెస్ట్ లిఫ్టర్ అవార్డు కైవసం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటివి ఎన్నో అవార్డులను గెలవాలని రవి సింగ్ బిద్లాన్ ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు కొలను బాల్ రెడ్డి, నవీన్ కుమార్, గోపాల్ రెడ్డి, రవికుమార్, నర్సింగ్ రావు, నవీన్ బిద్లాన్, ముఖేష్ కుమార్, రమేష్ బోయ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News