Thursday, September 19, 2024
HomeతెలంగాణKarimnagar: బాధిత మహిళలకు మేమున్నాం

Karimnagar: బాధిత మహిళలకు మేమున్నాం

వివిధ సమస్యలతో సఖీ కేంద్రానికి వచ్చే మహిళలపట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ మేమున్నామన్న ధైర్యాన్ని బాధిత మహిళలకు కల్పించాలని రాష్ట్ర మహిళ కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునీత లక్ష్మారెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన వివిద కార్యక్రమాలలో పాల్గోనడానికి వచ్చిన రాష్ట్ర మహిళా కమీషన్ సభ్యులకు జిల్లా కలెక్టర్, పోలీస్ కమీషనర్ లు స్వాగతం పలికారు. ఈ సందర్బంగా జిల్లా కేంద్రంలోని సఖీ వన్ స్టాప్ కేంద్రాన్ని సందర్శించిన కమిషన్ సభ్యులు కేంద్రంలోని ఇద్దరు బాధిత మహిళలతో వారు మాట్లాడారు. అనంతరం కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పది రకాల సేవలను ఒకే గొడుగు క్రిందకు తీసుకువచ్చిన సఖీ కేంద్రం వివిద సమస్యలతో సఖీ కేంద్రానికి వచ్చే మహిళల పట్ల మర్యాదపూర్వకంగా, గౌరవప్రదంగా ప్రవర్తించాలని, వారి సమస్యలను సానుకూలంగా వినీ సత్వర న్యాయం జరిగేలా సహాకరించాలని సూచించారు. సమస్యలతో వచ్చే బాధిత మహిళలకు చట్టాలపై అవగాహన కల్పిస్తూ వారికి న్యాయం చేకూర్చాలని అన్నారు. గృహహింస కేసులు దాదాపుగా వస్తున్నాయని, దానికి సంబంధించి బాదితుల కొరకు డి ఎల్ ఎస్ ఎ ద్వారా అడ్వకేట్ ను ఏర్పాటు చేయడం, నష్టపరిహారాన్ని అందించేలా చర్యలు వేగవంతం చేసేలా చూడడం జరుగుతుందని తెలియజేశారు. మహిళపై జరుగుతున్న అకృత్యాలపై అవగాహన కల్పించేలా పాఠశాలలు, కళాశాలలు మరియు గ్రామస్థాయిలో సఖీ, ఎంఎస్కే, షీ టీం బృందంతో అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మహిళా చట్టాలపై మహిళలతో పాటు పురుషులకు స్పష్టమైన అవగాహన కల్పించాలని అన్నారు. గ్రామీణ స్థాయిలో నిర్వహించే అవగాహన కార్యక్రమాలలో ప్రజాప్రతినిధులను కూడా భాగస్వాములను చేయాలన్నారు. బాదితులు కోరుకుంటున్న విధంగా సహాయాన్ని అందించేలా చూడాలన్నారు. సఖీ కేంద్రాల ద్వారా చర్యలు తీసుకుంటున్న వివరాలు, కేసుల క్లోజింగ్ వివరాలను కమీషన్ కు ఎప్పటికప్పుడు పంపించాలని ఆదేశించారు. నేరుగా వచ్చే ఫిర్యాదులపై మాత్రమే కాకుండా వివిద వార్తా పత్రికలు, చానల్ ల ద్వారా వచ్చే ఘటనలపై కూడా స్పందించి బాదిత మహిళలకు న్యాయం చూకూర్చాలని తెలియజేశారు.
అంతకుముందు రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులు జిల్లా మహిళా కారాగారంలోని 27మంది మహిళా ఖైధీలను కలిసి వారి కేసుల వివరాలను గురించి అడిగి తెలుసుకున్నారు. వివిద కేసులలో శిక్షలను అనుభవిస్తున్న వారు వారి ప్రవర్తనను మార్చుకోవాలని, ఖైదీలకు యోగాతో పాటుగా సఖీ ద్వారా లీగల్ కౌన్సిలింగ్ ఇప్పించాలని సూచించారు. ఖైదీలతో పిల్లలపై జైలు ప్రభావం పడకుండా వారిని రెసిడెన్సియల్ పాఠశాలలో చేర్పించేలా చూడాలన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, సిపి సబ్బా రాయుడు, శిక్షణ సంయుక్త కలెక్టర్ నవీన్ నికోలస్, ఆర్ డి ఓ ఆనంద్ కుమార్, మహిళా కమిషన్ సభ్యులు షాహిన్ అఫ్రోజ్, కుమ్ర ఈశ్వరి భాయి, కొమ్ము ఉమాదేవి, గద్దల పద్మ, శుద్ధం లక్ష్మి, కటారి రేవతి, మహిళా కమిషన్ డైరెక్టర్ శారద, మహిళా కమిషన్ కార్యదర్శి కృష్ణ కుమారి, డిడబ్ల్యూఓ సబితాకూమారి తదితరులు పాల్గోన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News