Friday, April 18, 2025
HomeతెలంగాణManoharabad: ముదిరాజ్ సంఘం భవన నిర్మాణానికి శంకుస్థాపన

Manoharabad: ముదిరాజ్ సంఘం భవన నిర్మాణానికి శంకుస్థాపన

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం జీడిపల్లి గ్రామంలో నిర్మించనున్న ముదిరాజ్ సంఘం భవనానికి జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ ర్యాకల హేమలత శేఖర్ గౌడ్,మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డితో కలసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముదిరాజు భవన నిర్మాణానికి 5 లక్షలు మంజూరు చేశామని, మరో 5 లక్షలు కూడా మంజురయ్యేలా చూస్తామని తెలిపారు.కళ్యాణ లక్ష్మీ, షాది ముభారఖ్, రైతు బంధు, రైతు భీమ లాంటి అనేక సంక్షేమ పథకాలతో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. అన్ని కుల సంఘాలను ఆదుకుంటున్న ఏకైక రాష్ట్ర మనదేనన్నారు.ముదిరాజ్ సంఘం భవన నిర్మాణంకు సహకరించిన జెడ్పి ఛైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ,మండలంలోని గ్రామాలలో ముదిరాజుల కుల దైవం పెద్దమ్మ తల్లి దేవాలయాలను నిర్మించడంలో సహకారం అందించాలని మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు నరేష్ కోరారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ విట్టల్ రెడ్డి,సర్పంచ్ రేఖ మల్లేష్,ఎంపీటీసీ స్వర్ణలత వెంకటేష్ ,మాజీ సర్పంచ్ రాగం శ్రీనివాస్,పంపరి నగేష్,డీఈ నర్సింలు,ఎంపిడిఓ యాదగిరి రెడ్డి, ఆత్మ కమిటీ డైరెక్టర్ రామకృష్ణ, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు కర్రే శ్రీనివాస్, లింగం స్వామి, ఎం.రాజు, ముదిరాజ్ సంఘం సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News