Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: ఎస్టీ కమిషన్‌ యాప్ ప్రారంభించిన సీఎం

AP: ఎస్టీ కమిషన్‌ యాప్ ప్రారంభించిన సీఎం

రాష్ట్ర ఎస్టీ కమిషన్ వార్షిక నివేదికను సీఎం జగన్ కు సమర్పించింది. ఈమేరకు ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌, సభ్యులు సీఎం జగన్ ను కలిశారు. కమిషన్‌కు సంబంధించిన పూర్తి సమాచారంతో కూడిన బ్రోచర్‌ను, ఎస్టీ కమిషన్‌కు సంబంధించిన ఏపీఎస్టీసీ.ఇన్‌ వెబ్‌సైట్‌ను, ఏపీ ఎస్టీ కమిషన్‌ యాప్‌ను కూడా ఈ సందర్భంగా ఆవిష్కరించారు సీఎం వైయస్‌.జగన్‌. గిరిజనుల అభ్యున్నతి-వారి సమస్యల పరిష్కారం కోసం దేశంలో తొలిసారిగా ఏపీ ఎస్టీ కమిషన్‌ యాప్‌ను రూపొందించింది రాష్ట్ర షెడ్యూల్డ్‌ తెగల కమిషన్‌.

- Advertisement -

క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌ను కలిశారు రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ కుంభా రవిబాబు, కమిషన్‌ సభ్యులు వడిత్యా సోమశంకర్‌ నాయక్, మత్స్యరాస విశ్వేశ్వరరాజు, కొర్ర రాము, చిచ్చడి మురళీ, గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్‌ మురళీ, ఎస్టీ కమిషన్‌ సెక్రటరీ డాక్టర్‌ గంగాధర్‌.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News