Sunday, October 6, 2024
Homeహెల్త్Over eating: అతిగా తింటున్నారా? ఈ టిప్స్ ఫాలో అవండి

Over eating: అతిగా తింటున్నారా? ఈ టిప్స్ ఫాలో అవండి

ఇటీవల కాలంలో అర్థరాత్రి సమయంలో అతిగా తినే అలవాటును చాలామందిలో చూస్తున్నాం. అనారోగ్యకరపు ఆహారపు అలవాట్లు, జీవనశైలి ఉన్న వారిలో ఈ బలహీనత బాగా ఉంది. రాత్రుళ్లు అతిగా తినే అలవాటును పోగొట్టుకోవాలని చాలామంది కష్టపడుతుంటారు. కానీ దాని నుండి బయటపడేవారు చాలా తక్కువమంది మాత్రమే. ఈ బలహీనతను జయించడానికి కొన్ని టిప్ప్ ఉన్నాయి.

- Advertisement -

నిత్యం బ్రేక్ ఫాస్ట్ ను తప్పనిసరిగా తీసుకోవాలి. ఇది శాస్త్రీయంగా నిరూపించబడిన సత్యం. రోజులో ఉదయం వేళల్లో మన శరీరం చాలా చురుకుగా ఉంటుంది. అందుకే శరీరానికి ఆ టైములో బలవర్ధకమైన బ్రేక్ ఫాస్ట్ చాలా అవసరం. అంతేకాదు ఆ టైములో బలవర్ధకమైన బ్రేక్ ఫాస్ట్ ఎంతో వేగంగా అరుగుతుంది . హెవీ బ్రేక్ ఫాస్ట్ తీసుకున్నప్పుడు మధ్యాహ్నం తేలికపాటి భోజనం తీసుకోవాలి. రాత్రి పూట మరింత సులభంగా జీర్ణమయ్యే ఆహారం మాత్రమే తినాలి. కానీ దురద్రుష్టకరమైన విషయం ఏమిటంటే మనలో చాలామంది ఇందుకు పూర్తిగా విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం. రాత్రుళ్లు హెవీ డిన్నర్ చేస్తుంన్నాం. రాత్రిళ్లు తిన్న ఆహారం పగటి వేళల్లో మల్లే వేగంగా, సులభంగా జీర్ణం కాదు. సమయాభావం, వేగవంతమైన జీవన శైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, విస్త్రుతమైన సామాజిక కార్యకలాపాల వల్ల ఎంతో ముఖ్యమైన బ్రేక్ ఫాస్ట్ ను చాలా మంది తినకుండా ఎగ్గొట్టేస్తున్న పరిస్థితి నేడు మనం చూస్తున్నాం. తీరిక లేని పనివేళల కారణంగా రాత్రుళ్లు బరువైన ఆహారాన్ని తీసుకుంటున్నాం. పైగా అతిగా తింటున్నాం. దీంతో శరీరంలో అనారోగ్యకరస్థాయిలో కేలరీలు చేరుతున్నాయి. బరువు విపరీతంగా పెరగుతున్నారు.

రాత్రిళ్లు పడుకునే సమయానికి రెండు మూడు గంటల ముందే ఆహారం తింటే బరువు పెరగరు. ఇలా చేయడం వల్ల ఆహారం సులభంగా జీర్ణమవడమే కాకుండా, శరీరంలో అధిక కాలరీలు చేరవు. అంతేకాదు శరీరంలోని కేలరీలు నిద్రలో ఫ్యాట్ గా మారవు. రాత్రుళ్లు బాగా పొద్దుపోయిన తర్వాత తినడం వల్ల బరువు పెరుగుతారు. రాత్రి ఎక్కువ గంటలపాటు ఆహారం తీసుకోకుండా ఉంటాం. కాబట్టి శరీరంలోని కొవ్వు ఎనర్జీగా మారే అవకాశం ఉంది. అంతేకాదు తొందరగా డిన్నర్ చేయడం వల్ల మంచి నిద్ర పడుతుంది. సాయంత్రం ఏడు గంటల లోపు డిన్నర్ పూర్తిచేయడం వల్ల ఆహారం జీర్ణమవుతుంది. బరువు కూడా బాగా తగ్గుతారు. ముఖ్యంగా రాత్రిళ్లు అతిగా తినడం తగ్గాలంటే బ్రేక్ ఫాస్ట్ ను ఎలాంటి పరిస్థితుల్లోనూ మానకూడదు. బ్రేక్ ఫాస్ట్ మానితే రోజంతా ఆకలిగా ఉంటుంది. దీంతో రాత్రి అతిగా తింటాము. ఉదయం పోషకవిలువలతో కూడిన బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటే రోజంతా ఎంతో శక్తితో, ఎనర్జీతో ఉంటాం. ఆకలి అనిపించదు. ఫలితంగా రాత్రుళ్లు అతిగా తినే అలవాటు కూడా పోతుంది. రోజులో ఒకేసారి ఏకమొత్తంగా హెవీ మీల్స్ చాలా మంది తీసుకుంటుంటారు. చిన్న చిన్న పరిమాణాలలో రోజులో నాలుగుసార్లు ఆహారం తింటే కడుపు నిండుగా ఉంటుంది. ఆకలి వేయదు. డిన్నర్ కూడా మితంగా తీసుకుంటాం. రోజులో తక్కువ పరిమాణంలో నాలుగు సార్లుగా తినడం వల్ల నడుము కూడా పెద్దది కాదు.చిన్న ప్లేటులో తినడం అలవాటు చేసుకుంటే అందులో పట్టేంత మేరే అంటే మితంగా ఆహారాన్ని తింటాం. దీనితో పాటు రోజు మొత్తంలో నీళ్లు బాగా తాగుతుండాలి. ఈ అలవాటు వల్ల శరీరం ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంటుంది.

ఆహారం తీసుకునే ముందర రెండు గ్లాసుల నీళ్లు తాగితే కడుపు నిండినట్టయి భోజనం అతిగా తినరు. చాలా మంది అన్నం తింటూ మధ్య మధ్యలో నీళ్లు బాగా తాగుతుంటారు . ఇలా చేయడం వల్ల ఆహారం సరిగా జీర్ణం కాదు. అంతేకాదు మీరు తీసుకునే బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనాలలో పోషకాలు ఉండే పదార్థాలు తినాలి. ప్రొటీన్ ఫుడ్ తినడం వల్ల ఆకలి తొందరగా వేయదు . రోజంతా కడుపు నిండుగా ఉన్నట్టు ఉంటుంది. అంతేకాదు పోషకాహారాలతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల శరీరం అలసటకు గురికాదు. అంతేకాదు శరీరానికి కావలసినంత ఎనర్జీ అందుతుంది. రాత్రి సమయాలలో ఆకలి ఎక్కువగా ఉండదు. దీంతో అతిగా తినే అలవాటు తగ్గుతుంది. అలాగే ఆహారాన్ని హడావిడిగా కాకుండా మెల్లగా తినాలి. బాగా నమిలి తినాలి. ఇలా చేయడం వల్ల తిన్న ఆహారం బాగా జీర్ణమవుతుంది. గబగబా అన్నం తినడం వల్ల మనకు తెలియకుండానే ఎక్కువగా తింటాం. అంటే మన పొట్టకు అవసరమైన దానికన్నా కూడా ఎక్కువ తింటామన్నమాట. రాత్రుళ్లు జీర్ణవ్యవస్థ పనితీరు బాలహీనంగా ఉంటుంది కాబట్టి ఆహారాన్ని అధికంగా తింటే శరీరం బరువు పెరుగుతుంది. అది జీర్ణమవడం కూడా కష్టమే. అందుకే శరీరం బరువు పెరగకుండా, అతిగా తినకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించుకోవాలి. పొట్టకు తగినంత ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News