Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru: చెన్నకేశవ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకోండి

Emmiganuru: చెన్నకేశవ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకోండి

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల గ్రామంలో చెన్నకేశవ స్వామి భూములు, రిజర్వు ఫారెస్ట్ భూములు దాదాపు 400 ఎకరాలు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డితో పాటు, ఆయన తనయుడు ఎర్రకోట జగన్ మోహన్ రెడ్డి అధీనంలో ఉన్నాయని వాటిని ఆక్రమించి వాటి నుండి వచ్చే ఆదాయాన్ని దండుకుంటున్నారని ఎమ్మిగనూరు మండల టిడిపి అధ్యక్షులు పార్లపల్లె గొల్ల మల్లికార్జున అన్నారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. వైసిపి నాయకులు ఎర్రకోట జగన్ మోహన్ రెడ్డి కడిమెట్ల చెన్నకేశవ స్వామి భూములు నుండి వచ్చే ఆదాయాన్ని అక్రమంగా తీసుకుంటూ తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేస్వర రెడ్డికు సవాలు చేయడం సిగ్గు చేటన్నారు. మీ అవినీతి అక్రమాలు ఆధారాలతో పాటు నిరూపించామని, మీకు పౌరుషం, నైతిక విలువలుంటే రాజకీయ సన్యాసం తీసుకోవాలని సవాలు విసిరారు. వంశపారంపర్య ధర్మకర్తలమని చెబుతూ ఆలయాన్ని అభివృద్ధి చేశారా? వాటి నుండి వచ్చే ఆదాయాన్ని మీరు తీసుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని టీడీపీ ఆరోపించింది. చెన్నకేశవ స్వామి దేవాలయంకు తేరు తయారు చేయడానికి గ్రామ ప్రజలు ఒక్కొక్కరు 2100 రూపాయిలు చందా వేసుకొన్నారని గుర్తుచేశారు. కాంపౌండ్ వాల్, సిసి రోడ్డు, సిమెంట్ ను గొల్ల, బోయ కులస్థులు ఇచ్చారన్నారు. ధ్వజ స్తంభంను గొల్ల దానప్ప చేయించారని, గుడికి ఇంతవరకు గోపురం లేదని, కడిమెట్లలో గానలోల్ల బీడు 70 ఎకరాలు ఉందని టీడీపీ ఏకరువు పెడుతోంది.

- Advertisement -

ఇందులో సర్వే నెంబర్ 584 లో 22.27 ఎకరాలు,585 లో 2.76 ఎకరాలు, 586 లో 7.25 ఎ కరాలు, 587 లో 0.87 సెంట్లు, 588 లో 5.78 ఎకరాలు, 589 లో 3.56 ఎకరాలు ఉంది. ఆంజనేయ స్వామి దేవాలయం భూములు సర్వే నెంబర్ 70 లో 19.30 డోలు మాన్యం ఇది (కేశవ రెడ్డి పేరు పై ఉంది పండ్ల తోట వేశారు) ఎకరాలు, 30 లో 10.12 ఎకరాలు, 31 లో 15.35 ఎకరాలు( దేవుని దీప దుపా నైవేద్యములు కు), ఇనాం భూములు సర్వే నెంబర్ 71 లో 6.13 ఎకరాలు, 72 లో 2.97 ఎకరాలు, 73 లో 12.74 ఎకరాలు, 74 లో 4.83 ఎ కరాలు ఉంది.వీటిని ఇతరులకు గుత్త కు ఇచ్చుకున్నారు. రిజర్వు ఫారెస్ట్ భూములు సర్వే నెంబర్ 483 లో 136.85 ఎకరాలు ఇందులో 125 ఎకరాలు రాళ్లగుట్ట ,10 ఎకరాలు చెరువు ,1 ఎకరా జయసుధ ,శంకర్ పేరుపై ఉంది. సర్వే నెంబర్ 432,431,430 లో జగన్ మోహన్ రెడ్డి పేరు పై క్రషర్ మిషన్ లీజు అనుభవ దారుడు గా ఉంది. మరో రిజర్వు ఫారెస్ట్ భూమి సర్వే నెంబర్ 707 లో 150 ఎకరాలు కడిమెట్ల ,ఐ కొండ ప్రజలకు పట్టాలు ఇచ్చారు. వాటిని ఎమ్మెల్యే ఆక్రమించి 6 మంది ను కాపలా పెట్టారు.అభుములలో ఎవరు సాగు, విత్తనాలు చేయకుండా దౌర్జన్యం చేస్తున్నారు. పక్క ఆధారాలు ఇచ్చాం రాజకీయ సన్యాసం వేసుకునే నిర్ణయం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారంటూ టీడీపీ నిప్పులు చెరిగింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News