Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Athmakuru: మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించిన శిల్పా

Athmakuru: మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించిన శిల్పా

వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ మన వైఎస్ఆర్ ప్రభుత్వం ద్వారా ఈరోజు రైతుల పక్షనా నిలబడిన ఏకైక ప్రభుత్వం మన వైయస్సార్ ప్రభుత్వం అని అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతులకు అందరికీ ఎన్నో ప్రత్యేక పథకాలు ఏర్పాటు చేసి వారికి వ్యవసాయం ద్వారా రాబడి పెరగడానికి రైతు భరోసా కేంద్రం ద్వారా సబ్సిడీలు అందిస్తున్నారన్నారు. రైతులు నష్టపోకుండా ప్రభుత్వం కేంద్రం ఏర్పాటు చేసిందన్నారు. సిద్దాపురం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 22 వేల ఎకరాలు మూడు పంటలు తీస్తున్నారని, రైతులు పండిన పంటకు మంచి మద్దతు ధర కూడా మన ప్రభుత్వం ద్వారా అందుతుందన్నారు. పంటపొలాలకు నీరు అందని సందర్భాలలో సొంత నిధులతో రైతులకు పరిష్కరించిన సందర్భాలు చాలా ఉన్నాయని, నేను రైతుబిడ్డగా ఆ కష్టం తెలిసిన వాడనన్నారు. ఎప్పుడైనా, ఎక్కడైనా రైతు సమస్యలుంటే పరిష్కరించడంలో నేను ముందుంటానని సభకు వచ్చిన రైతులందరికీ భరోసా కల్పించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ , ఎంపీపీ , జడ్పిటిసి సభ్యులు, పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, వార్డు గ్రామ నాయకులు కార్యకర్తలు, రైతులు, వ్యవసాయఅధికారులు, రైతు భరోసా సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News