దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆదుకోవాల్సిన బాధ్యత మనదే అని, రైతులకు ముఖ్యమంత్రి కేసీఅర్ ఎప్పుడూ అండగా ఉంటారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. మార్క్ ఫెడ్ అధ్వర్యంలో చింతకాని మండల కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పువ్వాడ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. రైతులు తాము పండించిన పంట నష్టపోకుండా ఉండేందుకు, రైతు సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని అందుకే అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని సైతం కొంటామని ముఖ్యమంత్రి కేసీఅర్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. BRS ప్రభుత్వమే రైతు సంక్షేమ ప్రభుత్వం అని, వ్యవసాయాన్ని దేశంలోనే అగ్రభాగాన నిలిపిన ఒకే ఒక వ్యక్తి కేసీఅర్ అని ఏ ఒక్క రైతు నష్టపోకుండా ప్రభుత్వమే మొక్క జాన్నలను కొనాలను ముఖ్యమంత్రి కేసీఅర్ నిర్ణయించారని పేర్కొన్నారు.
వరి తో పాటుగా మొక్కజొన్న సాగు కూడా లాభసాటి గా ఉందని, మొక్కజొన్న ను కోళ్ల పరిశ్రమ, బిస్కెట్ తయారీకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో ఎంపి నామా నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ VP గౌతమ్, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ కురకుల నాగభూషణం, డీసీఎంసీ చైర్మన్ శేషగిరిరావు, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వర్లు, జిల్లా కో-ఆపరేటివ్ అధికారి విజయ కుమారి, మర్క్ ఫెడ్ జిల్లా మేనేజర్ సునీత, PACS చైర్మన్, సభ్యులు, రైతులు తదితరులు ఉన్నారు.