కరీంగనర్ జిల్లాలో చేపడుతున్న మనఊరు మనబడి,హెల్త్ సబ్ సెంటర్ ల నిర్మాణ పనులను జూన్ ఒకటి నాటికి పూర్తిచేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో యంపిడిఓలు, యంఈఓలు, ఎఈలు, ఎస్ఎంసి చైర్మన్ లతో మన ఊరు మనబడి, హెల్త్ సబ్ సెంటర్ పనులపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సమీక్షించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, జిల్లాలోని ప్రతి మండలానికి ఒకటి చొప్పున మంజూరైన హెల్త్ సెంటర్ ల నిర్మాణ పనులకు టెండర్ ప్రక్రియ మే చివరి నాటికి పూర్తికావాలని, ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పన దిశగా నిర్వహిస్తున్న మనఊరు మనబడి పనులను త్వరగా పూర్తిచేయాలని, పాఠశాలలకు వచ్చే ప్రతి స్టాకును సంబంధిత రిజీష్టరులలో నమోదు చేయాలని, నిర్మాణ పనులను పూర్తిచేసి బిల్లుల నమోదు ప్రక్రియ పూర్తయిన వాటి చెల్లింపులో ఎటువంటి అలస్యం ఉండదని తెలిపారు. ఇంకా పూర్తిచేయాల్సిన ఉన్నట్లయితే త్వరగా పూర్తిచేయాన్నారు. యంపిడిఓ లు పనులు త్వరగా పూర్తయ్యేలా మండలస్థాయిలో సమావేశాలను నిర్వహించి త్వరగా పూర్తిచేసేలా బాధ్యత వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాదికారి జనార్దన్ రావు, జిల్లా వైద్యాధికారి లతిలాదేవి, ఈఈ లు, పబ్లిక్ హెల్త్ అధికారులు, యంపిడిఓ లు, యంపిఓలు, ప్రదానోపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు.