Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Allagadda: వైసిపిఎంపీటీసీ రాధాతో పాటు 100 కుటుంబాలు టిడిపిలో చేరిక

Allagadda: వైసిపిఎంపీటీసీ రాధాతో పాటు 100 కుటుంబాలు టిడిపిలో చేరిక

వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశంఇస్తామనే ఆలోచనతో టీడీపీ నుండి వైసీపీ లోనికి వెళ్లారని అధికారంలోనికి వచ్చిన అనతి కాలంలోనే నాయకులు కార్యకర్తలకు పార్టీలో ప్రాధాన్యత లేకపోవడం జగన్మోహన్ రెడ్డి అర్థంపర్థం లేని పథకాలతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం చూసి ప్రజలు విసుకు చెంది మరల వైసిపి నుండి వలసలుగా వచ్చి టిడిపి లో చేరారని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. దొర్నిపాడు మండలంలోని రామచంద్రపురం గ్రామానికి చెందిన మూల్పూరి దయానందరావు వైసీపీ ఎంపీటీసీ కొంకా రాదతో పాటు మరో 100 కుటుంబాలు టిడిపి పార్టీలో చేరారు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ,భార్గవరామ్ టిడిపి యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి వీరందరినీ పార్టీలోకి ఆహ్వానించి టిడిపి కండువా వేశారు.అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మాట్లాడుతూ టిడిపి యువనేత నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్రను చూసి వైసిపి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీల కు భయం ప్రారంభమైందన్నారు. వైసిపి వారి అన్యాయాలు అక్రమాలను అరాచకాలను టిడిపి నాయకులు నిరూపిస్తుంటే వారిపై అక్రమ కేసులు బలాయిస్తున్నారన్నారు రాష్ట్రంలో వైసిపి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఎంతమంది ప్రజా ప్రతినిధులు ఉన్న అభివృద్ధి చేయడానికి నిధులు లేకపోవడానికి జగన్మోహన్ రెడ్డి అర్థంపర్థం లేని పథకాలతో ఖజానా ఖాళీ చేశాడన్నారు .రాయలసీమలో సాగునీరు త్రాగునీరును పట్టించుకునే వారే కనబడలేదు అన్నారు కేసికి సకాలంలో నీళ్లు రావాలన్నా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలన్న రైతుల పక్షపాతిగా నిలబడి వారి వెంట నడిచేది ఒక భూమా కుటుంబమేని ఆమె అన్నారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చినప్పటి నుండి ఒక పరిశ్రమ కూడా రాలేదన్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెచ్చిన కియా కంపెనీ కూడా వెనక్కు పోయే పరిస్థితులున్నాయన్నారు ఎమ్మెల్యే అభివృద్ధి మాట మరిచి పంచాయతీలు పంపకాలు ఇవే వారి పరిపాలనని ఎద్దేవా చేశారు. అంతకుముందు రామచంద్రపురం గ్రామానికి చేరుకున్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భార్గవ్ రామ్ నాయుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డిలకు పూలమాలలు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బత్తిన శేషగిరి బెజవాడ సుబ్బారావు సాంబయ్య గోపి అంజయ్య వెంకట్రావు వేమూరి సాయి ఆదినారాయణ హరిబాబు చౌడయ్య సిద్ది నారాయణ కొత్తపల్లి సురేంద్ర చాకరాజు వేముల నాయుడు కొండాపురం అమర్నాథ్ రెడ్డి టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News