Thursday, September 19, 2024
HomeతెలంగాణKondapaka: 15వ రోజుకు పంచాయతీ కార్యదర్శుల సమ్మె

Kondapaka: 15వ రోజుకు పంచాయతీ కార్యదర్శుల సమ్మె

రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రెగ్యులరైజ్ చేయాలని నిరవధిక సమ్మెకు దిగారు. నేటితో సమ్మె 15వ రోజుకు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద సమ్మెకు పిలుపునిచ్చారు అందులో భాగంగా సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జూనియర్ పంచాయతీ కార్యదర్శులు నిరసన దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులను ఉద్దేశించి జిల్లా పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు మమ్ము రెగ్యులేషన్ చేయాలని స్కేల్ వర్తింపచేయాలని ప్రొబెషన్ కాలాన్ని సర్వీసులోకి తీసుకోవాలని మూడేళ్ల కాలాన్ని నాలుగేళ్లకు పొడిగించడం అమానుషమని ప్రభుత్వం తన నిబంధనలు తని అధిగమించిందని అధ్యక్షుడు వివరించారు. మేము ఎంతో శ్రమకు ఓర్చి పది లక్షల మందిని రాస్తే పదివేల మంది కార్యదర్శులుగా ఎన్నిక కాబడ్డామని అర్హత కలిగినందుకే ఉద్యోగం వచ్చిందని దీనిని శ్రమ దోపిడీగా మారుస్తూ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవడం మానవ హక్కులకే భంగం అని ప్రభుత్వం ఇది గమనించాలని అన్నారు. మేం ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కేసీఆర్ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఔట్సోర్సింగ్ లో ఉన్న కార్యదర్శులను కూడా ఈ సందర్భంగా రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. మహిళా కార్యదర్శిలకు కూడా ప్రత్యేక హక్కులు లేకుండా ఉద్యోగ భద్రత లేకుండా ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరించడం విచారకరమన్నాడు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ గ్రామపంచాయతీలలో 79 గ్రామపంచాయతీలు గా ఎన్నుకోవడం మన రాష్ట్రానికి గర్వకరణం దీనిలో మా గ్రామపంచాయతీ కార్యదర్శుల శ్రమ ఎంతో ఉంది ప్రభుత్వం దీనిని గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నాం అన్నారు. ప్రభుత్వం పంతాలకు పట్టింపులకు పోకుండా మా న్యాయమైన డిమాండ్లను నెరవేర్చి మమ్ము ఆదుకోవాలని మేము కూడా తెలంగాణ ప్రజల్లో భాగమేనని తెలంగాణ అభివృద్ధికి మా వంతు కృషి కూడా ఉందని వారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉద్యోగాల్లో చేరకుంటే ఉద్యోగాలు పోతాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉద్యోగులను బెదిరించడం ఉద్యోగుల హక్కులను కాలరాయడమే ప్రభుత్వం ఇలాంటి బెదిరింపు చీరలు మానుకోవాలని ఆయన హితవు చెప్పారు. మేము ఏ రాజకీయ పార్టీ ప్రోద్బలంతో సమ్మెకు దిగలేదు మా హక్కుల సాధనకై మాత్రమే మేము సమ్మెలోకి వెళ్ళాము మాదంతా ఒకే సంఘం పంచాయతీ కార్యదర్శుల సంఘం దీనిని వేరుగా భావించకూడదని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చే వరకు సమ్మెను కొనసాగిస్తామని ప్రభుత్వానికి తెలియజేశారు.

- Advertisement -

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News