Friday, September 20, 2024
HomeఆటShafali Verma : భార‌త మ‌హిళ‌ల అండ‌ర్‌-19 జ‌ట్టు కెప్టెన్‌గా షెఫాలీ వ‌ర్మ‌

Shafali Verma : భార‌త మ‌హిళ‌ల అండ‌ర్‌-19 జ‌ట్టు కెప్టెన్‌గా షెఫాలీ వ‌ర్మ‌

Shafali Verma : స్టార్ బ్యాట‌ర్ షెఫాలీ వ‌ర్మ టీమ్ఇండియా అండ‌ర్‌-19 మ‌హిళ‌ల జ‌ట్టు కెప్టెన్‌గా ఎంపికైంది. ద‌క్షిణాఫ్రికా వేదిక‌గా 2023 జ‌న‌వ‌రిలో జ‌ర‌గ‌నున్న ఐసీసీ అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్‌లో పాల్గొనే జ‌ట్టును భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) సోమ‌వారం ప్ర‌క‌టించింది. ప్ర‌పంచ‌క‌ప్‌తో పాటు ద‌క్షిణాఫ్రికాతో జ‌ర‌గ‌బోయే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు కూడా జ‌ట్టును ఎంపిక చేసింది. ఈ రెండు జ‌ట్ల‌కు షెఫాలీ వ‌ర్మ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నుండ‌గా, శ్వేతా సెహ్రావ‌త్‌ వైస్ కెప్టెన్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌నుంది.

- Advertisement -

మ‌హిళల క్రికెట్‌ను ప్రోత్స‌హించేందుకు అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తొలిసారి అండ‌ర్‌-19 మ‌హిళ‌ల ప్ర‌పంచ‌క‌ప్‌ను నిర్వ‌హిస్తోంది. ద‌క్షిణాఫ్రికా వేదిక‌గా 2023 జ‌న‌వ‌రి 14 నుంచి 29 వ‌ర‌కు ఈ టోర్నీ జ‌ర‌గ‌నుంది. సౌతాఫ్రికా, యూఏఈ, స్కాట్లాండ్‌ల‌తో క‌లిసి భార‌త్ గ్రూప్‌-డిలో ఉంది. మొత్తం 16 జ‌ట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. ఆయా గ్రూపుల‌లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన జ‌ట్లు సూప‌ర్‌-6 ద‌శ‌కు చేరుకుంటాయి. సూప‌ర్‌-6 ద‌శ‌లో ప్ర‌తీ గ్రూప్ నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జ‌ట్లు సెమీఫైన‌ల్స్ ఆడ‌నున్నాయి. 29న పొట్చెఫ్‌స్ట్రూమ్‌లోని జేబీ మార్క్స్‌ ఓవల్‌ మైదానంలో ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్‌, దక్షిణాఫ్రికా సిరీస్‌కు భారత జట్టు :

షెఫాలీ వర్మ (కెప్టెన్), శ్వేతా సెహ్రావత్ (వైస్ కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), గొంగ‌డి త్రిష, సౌమ్య తివారీ, సోనియా మెహదియా, హర్లీ గాలా, హర్షితా బసు (వికెట్ కీపర్), సోనమ్ యాదవ్, మన్నత్ కశ్యప్, అర్చనా దేవి, పార్శ్వి దేవి, పార్శ్వి టిటా సాధు, ఫలక్ నాజ్, షబ్నమ్ ఎండీ, శిఖా, నజ్లా సీఎంసీ, యశ్‌శ్రీని ఎంపిక చేసింది.

వీరిలో శిఖా, నజ్లా సీఎంసీ, యశశ్రీ రిజర్వు ప్లేయర్లు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News