కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సీఎల్పీ నేత అసెంబ్లీ మాజీ స్పీకర్ భట్టి విక్రమార్క తలపెట్టిన పీపుల్స్ మార్చ్ చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలం చేరింది. షాబాద్ మండలం చందన్ వెళ్లి సీతారాంపూర్ హైతబాద్ భూనిర్వాసితులను ఆయన కలిశారు. నిర్వాసితులు భూములలో జరిగిన అన్యాయాన్ని బట్టి విక్రమార్కకు వివరించారు. అసెంబ్లీలో షాబాద్ మండల భూ సమస్యను లేవనెత్తి ప్రశ్నిస్తానని వారికీ హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ…. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది మా భూములు మాకు! మా పాలన మాకు! మా సంపద మాకోసమే అన్నారు. కెసిఆ ఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలేవని దళితులకు ఇస్తామన్న మూడెకరాల భూమి పేద బిడ్డలకు అందిస్తామన్న కేజీ టు పీజీ విద్య విధానం ప్రతి మండలానికి మూడుకు తగ్గకుండా పెడతామన్నమాట ఏమైందని ప్రశ్నించారు. ధరణి పోర్టల్ భూములను ఆక్రమించుకోవడానికి వచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్ర భూములు దేశంలోనే అత్యంత విలువైనయన్నారు. ఏడేళ్ల పాలనలో ప్రజా సంక్షేమం పక్కన పెట్టి ముఖ్యమంత్రి భూముల కోసమే ఎగబడ్డారన్నారు. నిజాం పరిపాలనలలో జమీందారు కోట మాదిరిగా కెసిఆర్ కుటుంబం హైదరాబాదు చుట్టూ వందల ఎకరాల్లో ఫామ్ హౌస్ లు నిర్మించుకున్నారన్నారు. టిఆర్ఎస్ నేతలు కేసీఆర్ ఫామ్ హౌస్ ను రోల్ మోడల్ గా తీసుకుని నిర్మిస్తున్నారన్నారు. అసలు రాష్ట్రంలో ప్రధాన భూ పరిపాలన కమిషనర్ “సీసీఎల్” ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో పేదలకు భూములు పంచితే భూములు లాక్కొని టిఆర్ఎస్ ప్రభుత్వం నాలుగు కోట్లకు ఎకరా చొప్పున సెజ్ ల పేరుతో ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టిందన్నారని మండిపడ్డారు.షాబాద్ మండలంలో రైతుల భూములు లక్ష కోట్ల ఆస్తులను లాక్కున్నారన్నారు. అమాయక రైతులు భూముల విలువ తెలువక నలిగిపోతే కేసీఆర్ ముఖం వెలుగుతుంని ఎద్దేవా చేశారు. రెవెన్యూ అధికారులు రికార్డులను తారుమారు చేశారని వీరిపై సిఐడి తో సమగ్ర విచారణ జరిపించాలన్నారు. బాధితుల పక్షాన గవర్నర్కు రాష్ట్రపతికి భూ సంబంధిత ఏజెన్సీలకు లేఖ రాస్తామన్నారు. చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ సలహాతో ధరణి తెచ్చి వేల ఎకరాల భూములను ప్రజలత లూటీ చేశారన్నారు. ఆంధ్రలో విధులు నిర్వహిస్తున్న సోమేశ్ కుమార్ రిటైర్మెంట్ తీసుకొని రాష్ట్రంలో ఇంకేం కుంభకోణం చేయడానికి కెసిఆర్ సలహాదారుగా వచ్చాడన్నారు. సీఎం చేసిన తప్పులు కప్పిపుచ్చడానికే లోకేష్ వచ్చాడని ఆయన తక్షణమే విధుల నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు.
ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును వైయస్సార్ హయాంలో 10 వేల కోట్ల ఖర్చు చేసి పనులు ప్రారంభించారన్నారు. ఇంకో 20 వేల కోట్లు ఖర్చు చేస్తే మూడు సంవత్సరాల వ్యవధిలో ప్రాజెక్టు పూర్తయి రంగారెడ్డి జిల్లాకు నీరొచ్చి శస్యశ్యామలం అయ్యేది ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో నేటికీ మొదటి పంపు ప్రారంభించకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో క్రీడా ప్రాంగణాల బోడు పెట్టారే తప్ప కృష్ణ గోదావరి నీళ్లు రంగారెడ్డికి రాలేవన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు కోసం ధర్నా చేశారన్నారు. ఉద్యమకారుల ప్రాణాలను పణంగా పెట్టి టిఆర్ఎస్ పార్టీలో మంత్రిగా చేరి చేవెళ్లను మర్చిపోయారన్నారు. నీళ్ల కంటే పదవులే ముఖ్యమని పార్టీ మారిన సబితా ఇంద్రారెడ్డి తీరును తప్పుపట్టారు. రాష్ట్రంలో నాయకులు తమ ప్రాంతం కోసం రాజీనామా చేశారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి రంగారెడ్డి జిల్లా కోసం ఏం చేశారని ప్రశ్నించారు. రాష్ట్రంలో విద్యాశాఖ ప్రమాదంలో ఉందని పాఠశాలలలో ఉత్తీర్ణత శాతం తగ్గింన్నారు. కృష్ణ గోదావరి పాలమూరు- రంగారెడ్డి నీరు తేకపోతే మంత్రి సబితాకు ఓటు అడిగి నైతిక హక్కు లేదన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చల్ల నరసింహారెడ్డి రాచమల్ల సిద్దేశ్వర టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎలుగంటి మధుసూదన్ రెడ్డి ఉదయ్ మోహన్ రెడ్డి టిపిసిసి కార్యదర్శి రామ్ రెడ్డి షాబాద్ దర్శన్ దేశమొల్ల ఆంజనేయులు మొయినాబాద్ మండల అధ్యక్షులు మల్లయ్య చేవెళ్ల మండల అధ్యక్షులు ఆలంపల్లి రవీందర్ రెడ్డి చేవెళ్ల నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పెంటా రెడ్డి డిసిసి ప్రధాన కార్యదర్శి సొసైటీ చైర్మన్ తీవ్ర వెంకట్ రెడ్డి యాలాల మహేశ్వర్ రెడ్డి డిసిసి జనరల్ సెక్రెటరీ భార్గవరామ్ చేవెళ్ల మండల అధ్యక్షుడు మద్దెల శీను వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.