Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Yuvagalam: నవ దంపతులకు నూతన వస్త్రాలు పంపిన నారా లోకేష్

Yuvagalam: నవ దంపతులకు నూతన వస్త్రాలు పంపిన నారా లోకేష్

ఎమ్మిగనూరు- గోనెగండ్ల మండలం కున్నురు గ్రామానికి చెందిన నవ దంపతులకు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ నూతన వస్త్రాలను పంపారు. గోనెగండ్ల మండలం కున్నూరు గ్రామంలో బీ చిన్న రంగన్న కూతురు వివాహం జరిగింది. లోకేష్ పంపిన కొత్త దుస్తులను మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి చేతులకు మీదుగా కొత్త పెళ్లి కూతురు, పెళ్లి కుమారుడుకు అందజేశారు. మే 3 తేదీన యువగళం పాదయాత్రలో భాగంగా ఎమ్మిగనూరు నియోజకవర్గానికి విచ్చేసిన జాతీయ టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను చిన్న ఈరన్న కలిసి తన కూతురి వివాహానికి రావాలని వివాహ పత్రికను నారా లోకేష్ కు వివాహ పత్రికను ఇచ్చి ఆహ్వానించారు. పెళ్లికి రాలేకపోయినe నూతన వధూవరులకు తన తరపున నూతన వస్త్రాలను నారా లోకేష్ పంపారు. బివి జయనాగేశ్వర రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించి నారా లోకేష్ తరపున వారికి నూతన వస్త్రాలను అందించి నారా లోకేష్ తరపున వివాహ శుభాకంక్షాలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News