Sunday, November 10, 2024
Homeఓపన్ పేజ్Sink holes: ఇంటికో ఇంకుడు గుంత ఉండబోదు నీటికి చింత

Sink holes: ఇంటికో ఇంకుడు గుంత ఉండబోదు నీటికి చింత

వేసవి కాలం సమీపిస్తుందనగానే జంటనగరాల ప్రజల గుండెల్లో రాబోయే నీటి ఎద్దడి గురించి గుబులు మొదలవుతుంది. అందుకు కారణముంది మరి. గతేడాది జనవరిలో సగటు భూగర్భ జలమట్టం 6.52 మీటర్లుగా నమోదు కాగా 2023 జనవరిలో సగటు నీటి మట్టం 6.91 మీటర్లుగా నమోదైంది. గతేడాదితో పోల్చితే భూగర్భ నీటిమట్టం 0.39 మీటర్ల మేర తగ్గింది. భూగర్భ జలాలు అడుగంటడానికి ఎన్నో కారణాలున్నప్పటికీ, అధి క నీటి వినియోగంతో పాటు వర్షపు నీటిని ఒడిసిపట్టి భూమిలోకి ఇంకేలా చేయడంలో నగర వాసులు విఫలం కావడం ప్రధాన కారణాలుగా పేర్కొనవచ్చు.
ఇంకుడు గుంతల ఆలోచన
మానవాళి మనుగడకు ఎంతో విలువైన అద్భుత ప్ర కృతి వనరు నీటి ప్రాముఖ్యతను తెలిసిన ఎందరో సామా జిక కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు ఎలాంటి స్వలాభా పేక్ష లేకుండా దేశవ్యాప్తంగా నీటి సంరక్షణకు తమదైన శైలిలో ఉద్యమిస్తున్నారు. సమాజానికి సేవచేయడానికి కేవ లం సంకల్పం ఉంటే చాలు ఏ రాజకీయ పదవి అవసరం లేదు అని నిరూపించారు హైదరాబాద్‌లోని పద్మశాలి కాలనీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి, రాజపేట ఆంజనేయులు. జంటనరాలలో ప్రప్రథమంగా సరిగ్గా పాతి కేళ్ళ క్రితం 31 జూలై 1998న హైదరాబాద్‌లోని పద్మశాలి కాలనీలో జలయజ్ఞానికి శ్రీకారం చుట్టిన ఆయన బి హెచ్‌ ఈ ఎల్‌ విశ్రాంత అధికారి, ప్రముఖ సామాజిక కార్యకర్త మరియు ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌ ఆఫ్‌ ఇండియా సభ్యులు. 1997లో ఒకసారి ఆయన అధికారిక పనుల నిమిత్తం గుజరాత్‌లోని రాజ్‌ కోట్‌ సందర్శించిన సందర్భంగా అక్కడ కొందరు స్త్రీలు రోజంతా తలపై బిం దెలు పెట్టుకుని నీళ్ళు మోసే దృశ్యం ఆయనకు తీవ్ర బాధ కలిగించింది. అంతేకాక అప్పటికే తమ కాలనీలో కూడా భూగర్భ జలాలు తగ్గి నీటి ఎద్దడి ఏర్పడి ట్యాంకర్లపై ఆధా రపడవలసి రావడంతో ఆయన మస్తిష్కంలో మొదటి సారి ఇంకుడు గుంతల ద్వారా జలయజ్ఞం చేపట్టాలనే సంకల్పా నికి బీజం పడింది. వెంటనే ఆయన తమ కాలనీలోని భావ సారూప్యత గల ఐదుగురు మిత్రులతో కలిసి 31జూలై 1997న ప్రయోగాత్మకంగా పూర్తి శాస్త్రీయ ప్రమాణాలతో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయడమే కాక ఆ కార్య క్రమానికి నాటి స్థానిక ఎమ్మెల్యే కోదండరెడ్డిని ప్రారంభో త్సవానికి ఆహ్వానించారు. తొలి ప్రయత్నంలోనే ఆంజనే యులు శ్రమ ఫలించి భూగర్భజల మట్టం పెరగడంతో కాలనీలోని మిగతా వారు కూడా ఆయన సారధ్యంలో ఇం కుడు గుంతలు ఏర్పాటు చేసుకుని ఉపశమనం పొందారు. ఒకప్పుడు ట్యాంకర్లపై ఆధారపడే పద్మశాలి కాలనీ వాసులు ఇంకుడు గుంతల ద్వారా భూగర్భ జల మట్టాలు పెంచుకుని ట్యాంకర్లకు స్వస్తి పలకడంతో, ఈ వార్త నాటి హైదరాబాద్‌ జలమండలి ముఖ్యాధికారి డా ఎల్‌ వి సుబ్ర హ్మణ్యం, ఐ ఏ ఎస్‌ దృష్టికి రాగా ఆయన రామకృష్ణ రావు అనే ఒక అధికారిని ప్రత్యేకంగా నియమించి ఆంజనే యులు అవలంబించిన పద్ధతిని తెలుసుకుని ఆయన సహ కారంతో జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆ ప్రత్యేకాధికారి నేతృ త్వంలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి వర్షపు నీటి సం రక్షణకు నడుం బిగించింది. మరో పక్క ఆయన నేతృత్వం లో పద్మశాలి కాలనీ వాసులు భూగర్భ జల సంరక్షణకు ఇంకుడు గుంతల ఏర్పాటుతో చేస్తున్న ప్రయత్నాలు మరి యు వాటి సత్ఫలితాలను శ్లాఘిస్తూ పలు టీవీ ఛానెల్స్‌ ప్రసారం చేయగా దినపత్రికలు కూడా ప్రత్యేక కధనాలు ప్రచురించాయి. నానాటికీ తీవ్రమవుతున్న నీటి ఎద్దడిని ఎదుర్కోడానికి పద్మశాలి కాలనీలో ప్రారంభమైన ఇంకుడు గుంతల జలయజ్ఞం ఆనతి కాలంలోనే బాగా ప్రాచుర్యం పొందడంతో జంటనగరాలలోని చాలా కాలనీ వాసులుతో పాటు నీటి ఎద్దడి కారణంగా వాటర్‌ ట్యాంకర్ల కోసం భారీ గా డబ్బు ఖర్చు పెట్టే పలు అపార్ట్మెంట్లలో నివసించే వారు కూడా తమ తమ అపార్ట్మెంట్‌ ఆవరణలో ఇంకుడు గుంతల ఏర్పాటుకు ఆయనను సంప్రదించడం మొదలు పెట్టారు. అలా ఆయన సహాయంతో జంటనగరాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంది లబ్ది పొందుతున్నారు.
ప్రేరణగా నిలిచిన గాంధీ వారసత్వ భవనం కీర్తి మందిర్‌
మహాత్మా గాంధీ గారి ముత్తాత హర్జీవన్‌ జీ రహీదాస్‌ జీ గాంధీ 1777లో గుజరాత్‌, పోరుబందర్‌ లో ఒక స్థానిక మహిళ మణిబాయి నుండి కొన్న కీర్తి మహల్‌ భవంతిలో వాన నీటి సంరక్షణ కోసం అప్పట్లోనే ప్రత్యేక ఏర్పాటు చేసిన విషయాన్ని ఆ నోటా ఈ నోటా విని ఆయన స్వ యంగా అక్కడికి వెళ్లి ఆ ఇంటిని సందర్శించారు. ఆ ఇంట్లో ఇరవై అడుగుల పొడవు, పది అడుగుల వెడల్పుతో (లోతు సరిగ్గా తెలియడం లేదు) వర్షపు నీటిని సేకరించి నిల్వ చేయడానికి ప్రత్యేకంగా నీటి తొట్టె (సంపు) నిర్మించబడి ఉంది. అయితే గాంధీ ముత్తాత గారు కొనే నాటికే ఆ సంపు నిర్మింపబడిందా లేదా ఆ ఇంటిని కొనుగోలు చేసిన తరువాత ఆయన దీన్ని నిర్మించారా అన్న విషయంలో ఖచ్చితమైన సమాచారం మాత్రం అందుబాటులో లేదు. కాగా రెండు వందలకు పైగా సంవత్సరాల క్రితమే నిర్మిత మైన ఆ ఇంట్లో ఇలాంటి ప్రత్యేకమైన నిర్మాణాన్ని చేపట్టిన వారి దూరదృష్టి తనను ఆశ్చర్యచకితుడిని చేసిందంటారు ఆంజనేయులు. ఇది చూసిన తరువాత నగరాలు మరియు పట్టణాలలో సర్వసాధారణంగా వేసవిలో ఏర్పడుతున్న నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ఏదైనా పరిష్కార మార్గం కనుగొనాలనే ప్రేరణ తనకు కలిగిందని అంటారు ఆయన.
అధికారుల ఆరంభ శూరత్వం ఇంకుడు గుంతల ఏర్పాటుపై 10 ఆగష్టు 2001న హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ ప్రధాన కార్యాలయం ఖైరతా బాద్‌లో సమాచార కేంద్రం ప్రారంభించి ఇంకుడు గుం తల ఏర్పాటుకు నమూనాలు, వివరణాత్మక డిజైన్‌లు, కర పత్రాలు, పుస్తకాలను పంపిణీ చేయడం, ఎలక్ట్రానిక్‌, ప్రిం ట్‌ మీడియా ద్వారా మొక్కుబడిగా సమాచారాన్ని చేరవేయ డానికి భారీ మొత్తంలో ప్రజా ధనాన్ని వెచ్చించిన ప్రభుత్వా ధికారులు వాటి నిర్వహణలో మాత్రం అలసత్వం వహిస్తు న్నారు. ఓఆర్‌ఆర్‌ పరిధిలో 2012 నుండి 2017 వరకు హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ ఆధ్వర్యంలో సాలీనా సుమారు 4,12,128.53 కిలో లీటర్ల సాధారణ వర్షపాతాన్ని భూ మిలోకి ఇంకించి రీఛార్జ్‌ చేయాలన్న లక్ష్యంతో 26,991. 64 క్యూబిక్‌ మీటర్ల సామర్థ్యంతో 4,594 ఇంకుడు గుంత లను నిర్మించారు. భూగర్భ జలాలను పెంచడంలో ఇం కుడు గుంతల ప్రాముఖ్యతను గ్రహించిన అధికారులు కొత్తగా నిర్మించే భవనాలకు త్రాగునీరు, మురుగు నీటి కనె క్షన్‌ల మంజూరు చేయడానికి ఇంకుడు గుంతల ఏర్పాటు తప్పనిసరి అనే నిబంధన విధించినప్పటికీ క్షేత్ర స్థాయిలో దానిని పర్యవేక్షించడంలో మాత్రం శ్రద్ధ వహించలేదు. తగ్గిన వర్షపు నీటి సంరక్షణ
గత 4 దశాబ్దాలలో నివాస ప్రాంతాలు దాదాపు 10 నుండి 44 శాతం పెరగ్గా ఖాళీ స్థలాలు 38 నుండి 2 శాతా నికి తగ్గి బహిరంగ ప్రదేశాలు, ఉద్యానవనాలు మరియు క్రీడా మైదానాలు కేవలం 6.81 శాతానికి మాత్రమే పరిమి తమయ్యాయి. రవాణా మరియు కమ్యూనికేషన్‌ ప్రాంతం కూడా 6.67 శాతం నుండి 10.87 శాతానికి పెరిగింది. ఈ విధంగా భూ వినియోగ విధానంలో వచ్చిన తీవ్రమైన మార్పులు జలసంబంధ చక్రంలో వైరుధ్యాలకు దారి తీయడంతో పాటు భూగర్భ జలాల సహజ రీఛార్జ్‌ పరిధిని బాగా తగ్గించాయి. ఇదే కాక సరైన శాస్త్ర ప్రమాణాలతో ఇంకుడు గుంటలు ఏర్పాటు చేయబడిన భవనాలు, నివాస ప్రాంతాలు జంటనగరాల పరిధిలో చాలా తక్కువగా ఉన్నా యి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేకించి జలమండలి అధికారులు చొరవ తీసుకుని జంటనగరాలలోని అన్ని ప్రభుత్వ భవనాలలో ఖచ్చితమైన సాంకేతిక ప్రమాణాలతో కూడిన ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసి వాటి నిర్వహ ణను చేపట్టాలి. దీంతో పాటు జంట నగరాలలో మంచినీటి కనెక్షన్‌ ఉన్న ప్రతి అపార్ట్‌ మెంట్‌ మరియు ఇంట్లో కూడా ఇంకుడు గుంత విధిగా ఏర్పాటు చేసేలా చర్యలు చేప ట్టాలి. మలేరియా వ్యాధిని అరికట్టడానికి దోమల నిర్మూల నకు చర్యలు చేపట్టినట్లుగా ఇంకుడు గుంతల నిర్వహణ కోసం కూడా ప్రత్యేక తనిఖీలు చేపట్టి సాంకేతిక సలహాలు సూచనలు చేస్తూ ప్రతి ప్రాంతంలో భూగర్భ జలాల తీరు తెన్నులను సునిశితంగా అధ్యయనం చేస్తూ పెరుగుదలకు అవరోధంగా నిలుస్తున్న కారణాలను గుర్తించి వాటిని అధిగమించడానికి దిద్ద్దుబాటు చర్యలు చేపట్టాలి.
మక్కువతో సమాజసేవ
బాల్యం నుండే సామాజిక స్పృహ గల ఆయన 1972 లో కేవలం 13 సంవత్సరాల వయసులో సికింద్రాబాద్‌ లోని జనరల్‌ బజార్‌ లో కొందరు మిత్రులతో కలిసి వేసవి లో అక్కడికి షాపింగ్‌ కోసం వచ్చే వారి కోసం చలివేం ద్రాలు, ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంలో తోడ్పా టునందించారు. నాడు ప్రారంభించిన ఆయన సమాజసేవ నేడు స్వర్ణోత్సవం పూర్తైనా అప్రతిహతంగా కొనసాగు తోంది. జలయజ్ఞంతో పాటు ఎన్నో ప్రజోపయోగ కార్య క్రమాలలో తనవంతు సహకారాన్నందించడంలో ఆయన ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటారు. ప్రజా చైతన్యం తోనే అభివృద్ధి సాధ్యమనే విషయాన్ని ప్రగాఢంగా విశ్వ సించే ఆయన ఎన్నో వినూత్న ఆలోచనలతో వార్తల్లో నిలు స్తుంటారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే పాలకులు అని మనందరికీ తెలుసు. ప్రజలకు సేవ చేయడం అనేది ఈ వ్యవస్థలో మనం ఎన్నుకునే పాలకుల (ప్రజా ప్రతినిథుల) విద్యుక్త ధర్మం. ఈ విషయాన్ని ప్రజలు తమ పాలకులకు ఎప్పుడూ గుర్తు చేస్తూ ఉండాలి. అలా కాక పౌరులు సమా జం పట్ల తమ హక్కులు బాధ్యతలను విస్మరించినప్పుడు పాలకులు కూడా తమ తమ అధికారిక హోదాలలో భోగా లు అనుభవిస్తూ ప్రజాసమస్యలను గాలికొదిలేస్తారు. ఈ విషయం పట్ల ప్రజలను జాగృతపరచడానికి డిసెంబర్‌ 2018 లో శాసన సభకు జరిగిన ఎన్నికల సందర్భంగా ఆంజనేయులు తమ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించే వ్యక్తి సమర్థతను నిర్ధారించుకోవడం మరియు నియోజకవర్గ అభివృద్ధి పట్ల ఆ అభ్యర్థి ధృక్కోణం తెలుసు కోవడం కోసం #వైషుడ్‌ఐవోట్యూ? (#whyshouldivoteu?) అనే ఒక ప్రశ్నాపత్రాన్ని రూపొందించారు. ఎన్నికల సంద ర్భంగా రాజకీయ నాయకులు తమ ధన, కండ బలాలతో పౌరులను ప్రభావితం చేసే దుశ్చర్యలకు ఒడిగడుతున్నా రని ఈ కొత్త పద్ధతి ద్వారా పౌరులు రాజకీయ నాయకుల వాగ్దానాలు పనితీరును మూల్యాంకనం చేయడంతో పటు వారిలో జవాబుదారీతనాన్ని పెంచడానికి దోహదమవు తుందని ఆయన అంటారు. పద్మశాలి కాలనీ వాసుల ఈ వినూత్న ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా పౌర సమాజంలో చర్చకు తెరలేపడమే కాక బహుదా ప్రశంసనీయమైంది.
ఆంజనేయులు ఆలోచనలతో ఆదర్శంగా నిలుస్తున్న పద్మశాలి కాలనీ
నవంబర్‌ 2016లో పెద్ద నోట్ల రద్దు సందర్భంగా దేశ వ్యాప్తంగా నగదు చలామణి తగ్గి సంక్షోభం నెలకొనడంతో నిత్యావసర వస్తువుల కొనుగోళ్ళ కోసం ప్రజలు తీవ్ర ఇబ్బంది పడగా పద్మశాలి కాలనీ సొసైటీ సీనియర్‌ సభ్యు లు చొరవ తీసుకుని స్థానిక వ్యాపారులతో మాట్లాడి క్రెడిట్‌/డెబిట్‌ కార్డులు మరియు చెక్కుల ద్వారా కాలనీ వాసులకు సరుకులు అందించేందుకు ఒప్పించారు. ఈ ఆలోచన ద్వారా వారి వ్యాపారం కూడా పెరగడంతో వారు 5 శాతం డిస్కౌంటు కూడా ఇచ్చారు.
గుప్పెడు బియ్యం మీ జాలి గుండెకు చిహ్నం అన్న నినాదంతో 15 ఆగష్టు 2004 లో కాలనీలోని ప్రతి గృహి ణి ఒక గుప్పెడు బియ్యాన్ని ప్రతి రోజు వంటకు ముందు పక్కన పెట్టడం, ప్రతి 3 నెలలకు ఒకసారి కాలనీ ప్రతి నిథులు ఆ బియ్యం మొత్తాన్ని సేకరించి అనాధ శరణాల యాలకు అందిస్తూ వారికి బాసటగా నిలుస్తారు.
కరోనా వైరస్‌ కరాళ నృత్యం చేస్తున్న సమయంలో వైరస్‌ సోకిన కొందరు బయట స్వేచ్ఛగా తిరగడం వలన వ్యాధి ఇతరులకు సోకే ప్రమాదముందని గ్రహించిన సొసైటీ సభ్యులు తమ ఇంటి గేటు ముందు దయచేసి మా ఇంటికి రాకండి మీ ఇంటికీ రానివ్వకండి అంటూ బ్యా నర్‌ కట్టి కరోనా వైరస్‌ కట్టడికి తమదైన రీతిలో ఉద్యమిం చడంతో పాటు వారానికి ఒక సారి కాలనీ మొత్తాన్ని ఎస్‌ డి ఆర్‌ ఎఫ్‌ (స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌) సహకారంతో శానిటైజ్‌ చేపట్టారు. కాలనీ సమీపంలో ప్రధానంగా మధ్య దిగువ మధ్య తరగతి విద్యార్థులు చదివే ముషీరాబాద్‌ ప్రభుత్వ పాఠశా లలోని పదవ తరగతి విద్యార్థులకు 2020 సంవత్సరం ఉచిత శిక్షణా తరగతులు నిర్వహించారు.

- Advertisement -

యేచన్‌ చంద్ర శేఖర్‌
మాజీ రాష్ట్ర కార్యదర్శి
ది భారత్‌ స్కౌట్స్‌, గైడ్స్‌, తెలంగాణ

8885050822
9866656907

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News