Thursday, September 19, 2024
HomeతెలంగాణVemulavada: మల్కాపేట ప్రాజెక్టు ప్రారంభానికి సిద్ధం చేయండి

Vemulavada: మల్కాపేట ప్రాజెక్టు ప్రారంభానికి సిద్ధం చేయండి

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని మల్కపేట ప్రాజెక్టును త్వరలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించుకుందామని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు అన్నారు. మండలంలోని మల్కపేట రిజర్వాయర్ ప్రాజెక్టు ఆఫీసులో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు ఇంజనీర్ ఇన్ చీప్ ఎన్, వెంకటేశ్వర్లు, కరీంనగర్ డైరీ చైర్మన్ చల్మెడ రాజేశ్వరరావు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కొనరావుపేట, వేములవాడ మండలాలను సస్యశ్యామలం చేయనున్న మల్కపేట రిజర్వాయర్ మరియు నిమ్మపల్లి ఎత్తిపోతల పథకం లో భాగంగా మల్కపేట రిజర్వాయర్ ద్వారా సుమారు 30 వేల ఎకరాలు, నిమ్మపల్లి ప్రాజెక్ట్ స్థిరీకరణ ద్వారా 10 వేల ఎకరాల సాగు అందిస్తామన్నారు. ప్రాజెక్ట్ కుడి, ఎడమ కాల్వల మిగులు భూసేకరణ, పైపు లైను మరియు ఎగ్లాసుపూర్, శివంగల పల్లి, మర్రిమడ్ల లిఫ్ట్ పనుల పురోగతిపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్యాకేజ్ 9 మల్కపేట రిజర్వాయర్ ద్వారా వేములవాడ నియోజకవర్గానికి సంబంధించి వేములవాడ మండలం చంద్రగిరి, జయవరం, లింగంపల్లి, మారుపాక మరియు తిప్పాపురం లలో 5,601 ఎకరాలు, కొనారావుపేట మండలం ధర్మారం, కనగర్తి, కొలనూర్, పల్లిమక్త, మల్కపేట, మర్తన్నపేట, నాగారం, నిజామాబాద్ రామన్నపేట, సుద్దాలలో 25,694 ఎకరాలకు కొత్త ఆయకట్టు మరియు స్థిరీకరణ. నిమ్మపలి ప్రాజెక్ట్ ద్వారా 10 వేల ఎకరాల స్థిరీకరణ పనుల పురోగతిపై ఇంజనీర్ – ఇన్ – చీఫ్ ఎన్. వెంకటేశ్వర్లు, కరీంనగర్ డైరీ చైర్మన్ చెలిమెడ రాజేశ్వరరావు , ప్యాకేజీ 9 ఈ.ఈ శ్రీనివాస రెడ్డి తో సుదీర్ఘంగా చర్చించి మిగిలిన పనులు వచ్చే 20 రోజుల్లో పూర్తి చెయ్యడానికి ప్రణాళిక సిద్దం చేయలన్నారు . ప్రాజెక్ట్ పనులు సుమారు 90 శాతం పనులు పూర్తి అయ్యయన్నరు. రిజర్వాయర్ కుడి, ఎడమ కాలువ పనుల్లో మిగిలిన భూసేకరణ పనులు స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రాజెక్ట్ అధికారులు సమన్వయంతో పని చేసి రానున్న 10 రోజుల్లో పూర్తి చెయ్యాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్షలో ఎం.పీ.పీ చంద్రయ్య గౌడ్, సెస్ వైస్ చైర్మన్ తిరుపతి, రైతు బంధు సమితి మండల అధ్యక్షులు ప్రతాప రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు మల్యాల దేవయ్య, సర్పంచులు శ్రీను, సురేష్, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News