Monday, November 25, 2024
Homeహెల్త్Prickly heal: చెమటకాయలా ?

Prickly heal: చెమటకాయలా ?

చర్మంపై ఇరిటేషన్ తో తలెత్తే ఎర్రటి దద్దుర్లే చెమటకాయలు. అధిక ఉష్ణోగ్రతల బారిన పడినపుడు ఇవి తలెత్తుతాయి. చెమట, వేడి, తేమల కారణంగా శరీరంపై ఏ ప్రదేశంలోనైనా ఇవి రావచ్చు. చెమటకాయలు సాధారణంగా ముఖంపై, మెడభాగంలో, వీపుపై, ఛాతి, తొడలపై వస్తుంటాయి. చిన్నారుల్లో అయితే చట్టలపై, వెనుకభాగంలో ఎక్కువగా వస్తుంటాయి. పిల్లలకు డైపర్లు వేస్తుంటారు కాబట్టి చిన్నారుల్లో కూడా ఈ సమస్య ఎదురవుతోంది. ముఖ్యంగా వేసవిలో చెమటకాయలతో చాలామంది బాధపడుతుంటారు. దీనికి కొన్ని టిప్స్ ఉన్నాయి. అవేమిటంటే..
 వేసవిలో నీటిని బాగా తాగాలి. ఇలా చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రతలు చల్లబడతాయి.
 శరీరానికి గాలి బాగా తగలాలి. ఇందుకు చిన్నా పెద్దా అందరూ వదులు దుస్తులు ధరించాలి.
 టిష్యూ పేపరుని వెనిగర్ లో ముంచి చెమటకాయలు ఉన్న చోట సున్నితంగా అద్దితే అది మంచి ప్రభావం చూపుతుంది.
 బ్లాక్ టీని చర్మంపై రాసుకుంటే చెమటకాయలు పోతాయి.

- Advertisement -

 కాటన్ బాల్ ని లవంగం నూనెలో తడిపి చెమటకాయలపై మ్రుదువుగా రాస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
 మజ్జిగ, సబ్జా నీళ్లు, బార్లీ నీళ్ల వంటివాటిని రోజూ తాగాలి.
 గంధం, రోజ్ వాటర్ కలిపి ఆ పేస్టును చెమటకాయలు ఉన్న చోట రాసి పదినిమిషాలు ఆరనిచ్చి నీటితో కడిగేయాలి.
 చిన్నపిల్లలకు డయపర్లే వేయకూడదు. అలాగపిల్లలకు బాగా గాలి తగిలే దుస్తులు మాత్రమే వేయాలి. సింథటిక్ దుస్తులకు దూరంగా ఉండాలి.
 వేసవిలో కాటన్ దుస్తులు ధరించాలి. గాఢమైన రంగులు కాకుండా లేతరంగులున్న దుస్తులు మాత్రమే వేసుకోవాలి. వీటి వల్ల శరీరం కూల్ గా ఉండడంతో పాటు చర్మానికి సరిపడినంత గాలి కూడా అందుతుంది.
 విపరీత ఉష్ణోగ్రతల వల్ల తొందరగా శరీరంలో ఎనర్జీని కోల్పోతాం. అందుకే తరచూ నీళ్లను బాగా తాగుతుండాలి. నిమ్మకాయ నీళ్లు, కొబ్బరినీళ్లు బాగా తాగాలి. ఆల్కహాల్, కూల్ డ్రింక్సు కు దూరంగా ఉండాలి. డైట్ లో సీజనల్ గా వచ్చే పళ్లు, మూలికలతో తయారుచేసిన సహజసిద్ధమైన జ్యూసులను తప్పనిసరిగా తీసుకోవాలి.
 సలాడ్లు, ఫ్ల్రూట్లు వంటివి బాగా తీసుకోవాలి. నూనె పదార్థాలు, వేపుళ్లు, స్వీట్లు తినొద్దు. శరీరంలో వేడిని పెంచే ఫుడ్స్ జోలికి పోకూడదు. ఉదాహరణకు డార్క్ మీట్స్ శరీరంలో విపరీతమైన వేడిని పెంచుతాయి. దీంతో చెమటకాయల సమస్య ఎక్కువవుతుంది.

 వేసవికాలంలో శరీరాన్ని పొడిగా ఉంచుకోవాలి. ముఖ్యంగా స్నానం చేసిన తర్వాత తువ్వాలుతో శరీరాన్ని బాగా పొడిగా తుడుచుకోవాలి. చర్మంపై తేమ, తడి ఉంటే బాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి చర్మంపై తడి ఉండకుండా చూసుకోవాలి. పొడిచర్మంపై పౌడర్ చల్లుకుంటే శరీరం కూల్ అవుతుంది.
 పెరుగు చర్మానికి కావలసినంత చల్లదనాన్ని అందివ్వడమే కాకుండా చర్మాన్ని మ్రుదువుగా ఉంచుతుంది. అందుకే పెరుగును చెమటకాయలు వచ్చిన చోట రాసి పదిహేనునిమిషాలు అలాగే ఉంచి ఆ తర్వాత చల్లటి నీళ్లతో కడిగి పొడిగా ఉంచుకోవాలి. ఇరిటేషన్ ఉన్న ప్రదేశాన్ని చేతులతో గోక్కోకూడదు. పెరుగులో యాంటీ బాక్టీరియల్, యాంటిఫంగల్ సుగుణాలు ఉన్నాయి కాబట్టి చెమటకాయల నివారణలో ఇది ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. యాక్నే రాకుండా చర్మాన్ని సంరక్షిస్తుంది. అంతేకాదు ఆరోగ్యవంతమైన, మెరిసే చర్మాన్ని అందిస్తుంది.
 200ఎంఎల్ రోజ్ వాటర్, నాలుగు టేబుల్ స్పూన్ల తేనె, 200 ఎంఎల్ స్వచ్ఛమైన నీరు ఈ మూడింటినీ బాగా కలపి ఆ మిశ్రమాన్ని ఐస్ ట్రేల్లో పోసి అది ఐస్ ముక్కలు అయ్యే వరకూ ఫ్రిజ్ లో ఉంచాలి. ఈ ఐస్ ముక్కలు ఐదారింటిని తీసుకుని మెత్తటి బట్టలో వేసి చుట్టి చెమటకాయలు ఉన్న చోట ఆ గుడ్డతో అద్దాలి. రోజ్ వాటర్ చర్మంలోని పిఎస్ బ్యాలెన్సును పరిరక్షిస్తుంది. నూనె పదార్థాలు ఎక్కువ స్రవించకుండా నిరోధిస్తుంది.

 చెమటకాయలపై శాండల్ వుడ్ బాగా పనిచేస్తుంది. శాండల్ వుడ్ లో చల్లటిపాలు, మీగడ వేసి కలిపి మెత్తగా చేసి దాన్ని చర్మంపై పూసి అది బాగా ఆరేవరకూ ఉంచుకోవాలి. సూర్యరశ్మి దుష్పరిమాణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. శాండల్ వుడ్ లోని నేచురల్ ఆయిల్స్ వల్ల చర్మం సన్ ట్యాన్ బారిన పడదు.
 ముల్తానీ మట్టి కూడా చెమటకాయలపై బాగా పనిచేస్తుంది. ముల్తానీ మట్టిలో ఉన్న కూలింగ్ గుణమే ఇందుకు కారణం. రెండు టీస్పూన్ల పుదీనా పేస్టు, మూడు టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టి, సరిపడినన్ని పాలు తీసుకుని వీటన్నింటినీ బాగా కలిపి మెత్తటి పేస్టులా చేయాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News