Sunday, September 29, 2024
Homeఆంధ్రప్రదేశ్Lokesh: భవన నిర్మాణ కార్మికులకు జగన్ అన్యాయం

Lokesh: భవన నిర్మాణ కార్మికులకు జగన్ అన్యాయం

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే భవన నిర్మాణ కార్మికులకు తీవ్ర అన్యాయం చేశారని, ప్రస్తుతం భవన నిర్మాణ కార్మికులు పస్తులు ఉండవలసిన పరిస్థితి ఏర్పడిందని, జగన్ ప్రభుత్వం విపరీతంగా సిమెంటు ఇసుక,స్టీల్ రేట్లను పెంచడంతో పనులు లేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. యువగళం పాదయాత్ర నల్లకాలువ గ్రామం నుండి మొదలై, వెలుగోడుకు చేరుకుంది. వెలుగోడులో తెలుగు రిజర్వాయర్ ను లోకేష్ పరిశీలించిన అనంతరం భవన నిర్మాణ కార్మికులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ కు భవన నిర్మాణ కార్మికులు తమ భాదను వివరిస్తూ, జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇసుకకొరతో పనులు లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.అనంతరం లోకేష్ మాట్లాడుతూ టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే భవన నిర్మాణ కార్మికులసంక్షేమ బోర్డు కు నిధులు వెచ్చించి ఆదుకుంటామన్నారు. జగన్ కార్మికుల బోర్డు నుండి 3000 కోట్ల రూపాయలను స్వాహా చేశారని, ట్రాక్టర్ ఇసుక 5000 నుండి 7వేల వరకు అమ్ముకొని వైకాపా నాయకులు వెనకేసుకుంటున్నారని, ఇసుక వల్ల జగన్ కు ఒక రోజుకు మూడు కోట్ల ఆదాయం వస్తుంది అన్నారు. చంద్రబాబు నాయుడు 1996 లోనే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి వారిని ఆదుకున్నారని, చంద్రన్న బీమా ఏర్పాటు చేసి భవన నిర్మాణ కార్మికుల ఎవరైనా చనిపోయిన, గాయపడిన వెంటనే బీమా ఇచ్చే వారన్నారు. ప్రస్తుతం జగన్ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు భీమా ఇవ్వడం లేదని, బాడీ మన కార్మికులను గాలికి వదిలేసారు అన్నారు. కరోనా సమయంలో భవనర్మాణ కార్మికులకు, చిరు వ్యాపరస్తులకు సాయి మంది ఇస్తామని చెప్పి నేటి వరకు వారికి ఎలాంటి సాయం చేయలేదని లోకేష్ అన్నారు. పెయింటర్స్ ను జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని, వెల్డింగ్ కార్మికులకు కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందని సంక్షేమ పథకాలను తీసివేసిన ఘనత జగన్తో దక్కుతుందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే భువన నిర్మాణ కార్మికులకు ఇల్లు నిర్మించి, పిల్లలను న్యాయం చేస్తామని, అలాగే కార్మికులు ప్రమాదంలో చనిపోతే ఐదు లక్షలు, సహజ మరణం చెందుతే రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా అందిస్తామని లోకేష్ భవన నిర్మాణ కార్మికులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి, టిడిపి నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News