Saturday, November 23, 2024
HomeదైవంTirupathi: గంగమ్మ తల్లి 'భక్తి చైతన్య యాత్ర'

Tirupathi: గంగమ్మ తల్లి ‘భక్తి చైతన్య యాత్ర’

తిరుపతిలో 5 వరోజు గంగమ్మ భక్తి చైతన్య యాత్ర ఊహలకు అందని స్థాయిలో విజయవంతం అయింది. తిరుపతి పట్టణ ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో గంగమ్మ భక్తి చైతన్య యాత్రలో భాగస్వామి అయ్యారని స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం తొలి గడప అనంత వీధి నుండి ప్రారంభమైన గంగమ్మ భక్తి చైతన్య యాత్రలో స్థానిక ఎమ్మెల్యే పిలుపుతో పరసాల వీధి, రామచంద్ర పుష్కరిణి, మహతి ఆడిటోరియం, ఎస్పీ కార్యాలయం, కృష్ణాపురం ఠాణా, గాంధీ రోడ్డు, బండ్ల వీధి ద్వారా శ్రీ తాతయ్య గుంట గంగమ్మ ఆలయంకు చేరుకుంది. భక్తి చైతన్యంలో రాష్టంలోనే వివిధ జిల్లాలకు చెందిన వివిధ రకాల కళాకారులు దారి పొడవునా జానపద శైలిలో సాగే అమ్మ వారి భక్తి కీర్తనలతో, డప్పు వాయిద్యాల నడుమ భక్తులు లయబధ్ధంగా చిందేస్తూ పులకించి పోయారు. గంగమ్మ నామ స్మరణతో పట్టణం మారుమోగింది. నవదుర్గలు, కాంతారా, తప్పెటగుళ్లు, డప్పులు,తీన్ మార్, కీలు గుర్రాలు, కొమ్ము కొయ్య, దింసా, పగటి వేషగాళ్లు, పులివేషాలు, గరగల్లు, బోనాల,గిరిజన నృత్యం వంటి కళాప్రదర్శలు నడుమ ఊరేగింపుగా భక్తి చైతన్య యాత్ర గంగమ్మ ఆలయం చేరుకుంది.

- Advertisement -

అనంతరం ఆలయమువద్ద ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ 5వ రోజు నిర్వహించిన గంగమ్మ భక్తి చైతన్య యాత్ర ఊహలకు అందనిస్థాయిలో పట్టణ ప్రజలకు భాగస్వాములు అయ్యారని తెలిపారు. రంగుల పోటీల్లాగా వేషాలు వేసుకొని అతి ఉత్సాహంగా భక్తులు పాల్గొన్నారు. గంగమ్మ జాతరంటే ఇలాగే ఉంటుందని అనిపించేలా భక్తి చైతన్య యాత్ర సాగిందని తెలిపారు. వెంకటేశ్వర స్వామి చెల్లి గంగమ్మకు జరుపుకునే పండగ ఇదేని అనిపించేలా పట్టణంలోని ప్రతి గడప గడప నుండి కదిలివచ్చి చైతన్య యాత్రలో భాగస్వామ్యం అవడం జరిగిందన్నారు. జాతర బ్రహ్మత్స వాలు మొదలైనప్పటినుండి ఆలయంలో భక్తులతో కిటకిటలాడుతున్నదిని తిరుపతి చుట్టుపక్క ప్రాంతాల ప్రజలే కాకుండా పక్క రాష్ట్రాల నుండి కూడా అనేకమంది భక్తులు వచ్చి వేశాలు వేసి గంగమ్మను దర్శించుకోవడం జరుగుతుందన్నారు బ్రహ్మోత్సవాలు మొదలైనప్పటినుండి ప్రతిరోజు 80 వేల మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు ఈరోజు అయితే సుమారు లక్ష మంది భక్తులు గంగమ్మ దర్శించుకున్నారని తెలిపారు. గంగమ్మ తల్లికి ఇష్టమైన వేషాలు వేసుకొని గంగమ్మను తృప్తి పరచడం తో పాటు ఈరోజు నిర్వహించిన భక్తి చైతన్య యాత్ర విజయవంతంగా ముగిసిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, మున్సిపల్ కమిషనర్ హరిత నగర మేయర్ డాక్టర్ శిరీష డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ ఆలయ ధర్మకర్త మండలి చైర్మన్ కట్టా గోపి యాదవ్, ఈవో ముని ధర్మకర్త మండలి సభ్యులు, భక్తులు అందరూ పలు రకాల వేషాలుతో పాల్గొని తమవంతు భక్తిని చాటుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News