Friday, September 20, 2024
HomeఆటMallapur: 'మల్లాపూర్ క్రికెట్ లీగ్' విజేత సీయస్సార్ టీం

Mallapur: ‘మల్లాపూర్ క్రికెట్ లీగ్’ విజేత సీయస్సార్ టీం

మల్లాపూర్ క్రికెట్ లీగ్ ముగిసింది. మండల కేంద్రంలోని కె వి ఎస్ ఆర్ క్రీడా మైదానంలో నిర్వహించిన ఫైనల్ మ్యాచ్ లో సిఎస్ఆర్ టీం విజేతగా నిలిచింది. బహుమతుల ప్రధానోత్సవానికి ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యా సాగర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత క్రీడల పట్ల ఆసక్తి చూపాలని, చెడు వ్యాసనాలకు దూరంగా ఉండాలని అన్నారు. మొదటి సరిగా నిర్వహించి విజయవంతం చేసిన లీగ్ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. ఇట్టి కార్యక్రమం లో జడ్పీటీసీ సంది రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎంపి ఎల్ క్రికెట్ లీగ్ ప్రాంచైజీ ఓనర్స్, క్రీడాభిమానులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News