Saturday, October 5, 2024
HomeతెలంగాణCPI(ML): మిషన్ భగీరథ పైపు లైన్లు అన్ని కాలనీల్లో వేయరా?

CPI(ML): మిషన్ భగీరథ పైపు లైన్లు అన్ని కాలనీల్లో వేయరా?

మిషన్ భగీరథ పైపులైన్లు అన్ని కాలనిలలో వేయాలని నీటి సౌకర్యం కల్పించాలని, కాలని వాసులకు ఇంటి నెంబర్లు ఇవ్వాలని, కరెంటు లైన్లు వెేయాలని, కాలనిలలో మౌలిక సదుపాయలు కల్పించాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో కోర్టు సెంటర్ నుండి ఇందిరా గాంధీ సెంటర్, నెహ్రు సెంటర్, ప్రభుత్వ హాస్పటల్ మీదుగా మున్సిపాటిటి కార్యలయం వరకు భారీ ర్యాలీ అనంతరం ధర్నా నిర్వహించి మున్సిపాలిటి సూపర్డెంట్ కు వినతి పత్రం సమర్పించారు. ధర్నాను ద్దేశించి సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు మండల వెంకన్న మాట్లాడుతూ ,రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషిన్ భరీరథ పైపులైన్లు ఇంటింటికి కల్పిస్తామని ప్రకటించిన మన మున్సిపాలిటిలో మాత్రం వాటికి విరుద్ధంగా అంగబలం ప్రాతినిద్యం ఉన్న పార్టీ కాలనిలలో పైపులైన్లు వేసి మిగత కాలనీలను విష్మరిస్తున్నారని, అదికారులను. కలిసి విన్నంచుకున్న పెట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై అన్ని కాలనిలలో మంచినీటి సౌకర్యం కల్పించాలని, ఇంటినెంబర్లు, ఇవ్వాలని, కరెంటు సౌకర్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యు జిల్లా కార్యదర్శి బొమ్మన బోయిన అనసూర్యక్కూ, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి హలవత్ లింగన్న, పట్టణ కార్యదర్శి లక్ష్మయ్య, డివిజన్ నాయకులు సామ పాపయ్య, పర్వత కోటేష్, ఎండి జబ్బార్, ఐలయ్య, గుండెల కృష్ణ, యాకయ్య, కవిత, భానోత్ దేవేందర్, చంద్రమౌళి, రజిత, అనిత, ఉపేందర్, ఉమా, లక్ష్మి, నాగరాజు, యాకాంబరం, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News