Friday, September 20, 2024
HomeఆటBashirabad: రాష్ట్రస్థాయి పోటీలకు సిద్ధం కావాలి

Bashirabad: రాష్ట్రస్థాయి పోటీలకు సిద్ధం కావాలి

క్రీడా రంగానికి ఇచ్చిన ప్రాధాన్యాన్ని చాటి చెప్పేందుకు కూడా పోటీలను నిర్వహించడం అధికార యంత్రాంగం ఒక ఛాలెంజ్ గా తీసుకుని సీఎం కప్ 2023 గా సోమవారం బషీరాబాద్ మండలంలో నామకరణం చేశారు. మూడు రోజులపాటు క్రీడాలను నిర్వహించేందుకు మండల కేంద్రంలో బాయ్స్ హై స్కూల్ క్రీడా మైదానంలో ప్రారంభించేందుకు ముఖ్య అతిథి మండల్ వైస్ ఎంపీపీ జడలు అన్నపూర్ణ, అనంత గౌడ్ వాలీబాల్ పోటీలు ప్రారంభించడం జరిగింది.
సీఎం కప్పు క్రీడా పోటీలకు అధ్యక్షతన వహించిన చైర్మన్ ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్ అధికార పార్టీలో ఉండి ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడము చర్చనీయంగా మారింది. ఒకే పార్టీలో ఉండి ఒక ఎంపీపీ క్రీడా పోటీలకు చైర్మన్ ఉండడంతో ఆమె రాకపోవడము ఇది ఎంతవరకు సమంజసం అని పలువురు నాయకులు విమర్శించారు. సీఎం తలపెట్టిన పలు కార్యక్రమాలకు రాకపోవడము ఇది వర్గ పోరు అంటారా వ్యక్తిగత విషయాలు అంటారా అని కొందరు నాయకులు మాట్లాడుకోవడం జరిగింది. ఇది హై కమాండ్ దృష్టికి తీసుకెళ్లాలని ఒకే పార్టీలో ఉన్న నాయకులు అంటున్నారు.
ఈ సందర్భంగా అన్నపూర్ణ మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ పేరుమీద సీఎం కప్పు అని నామకరణము చేయగా. మనమందరం కలిసి ప్రారంభించడం జరిగింది. ఈ పోటీల్లో వాలీబాల్ కోకో కబడ్డీ 100 మీటర్స్ 200 మీటర్స్ పరుగు పంద్యాలు లాంగ్ జంప్ దగ్గర క్రీడాలను నిర్వహించుకోవడం జరుగుతుంది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో తాసిల్దార్ వెంకటస్వామి, ఎంపీడీవో రమేష్, ఎస్సై విద్యాచరణ్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు నర్సిరెడ్డి, రాము నాయక్, గోపాల్ రెడ్డి, మునీందర్ రెడ్డి, రంగారెడ్డి , అనంత గౌడ్ , రజాక్, ఎంపిటిసిలు రేఖ పవన్ ఠాకూర్, వడ్డే శ్రీనివాస్, టిఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ తహెర్ బాండ్, ఎస్టీ సెల్ అధ్యక్షులు నరేష్ చవాన్, సునీల్ ప్రసాద్, నరసింహులు, జగ్గు దాదా, హనుమంత్ రెడ్డి, గోపాల్, శంకర్ నాయక్ , ఎంపీడీవో సూపర్డెంట్ విజయ కుమారి, షేర్ ఖాన్, బాల రంగాచారి, ఫిజికల్ డైరెక్టర్ గోపాల్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News