Tuesday, April 15, 2025
HomeతెలంగాణPatancheru: సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన

Patancheru: సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన

జి హె చ్ ఎంసి పరిధిలోని డివిజన్లలో అభివృద్ధి పనులను శరవేగంగా చేపడుతున్నామని పటాన్చెరు శాసనసభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నుండి జాతీయ రహదారి వరకు 29 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిహెచ్ఎంసి పరిధిలోని ప్రతి డివిజన్లో ఇప్పటికే ఐదు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో సిసి రోడ్ల నిర్మాణ పనులు చేపట్టామని తెలిపారు. నూతనంగా ఏర్పటవుతున్న కాలనీలలో మౌలిక వసంత కల్పనకు నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ బాలయ్య, బి ఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News