తెలుగు ప్రభ యువగళం పాదయాత్ర వందరోజుల పూర్తి చేసుకున్న సందర్భంగా మరియు మాతృ దినోత్సవన్ని పురస్కరించుకుని లోకేష్ మాతృ మూర్తి బోయరేవులకు వచ్చి పాదయాత్రలో పాల్గొన్నారు. శిబిరం నుంచి సమీప గ్రామం ఐనా మొతూకూరు వరకు పాదయాత్ర లో పాల్గొని లోకేష్ ను ఉత్సాహపరిచారు. 100 రోజుల పూర్తైన సందర్భంగా స్థూపంను ఆవిష్కరించారు. టిడిపి నేత కేశినేని శివనాథ్ (చిన్ని) రూపొందించిన ప్రత్యేక సంచిక ఆవిష్కరించారు. యువగళం పాదయాత్ర అరాచక సర్కారుపై జనజైత్రయాత్రగా చరిత్రలో నిలిచిపోతుందని టిడిపి నేతలు పేర్కొన్నారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం వందరోజులు పూర్తయిన సందర్భంగా పాదయాత్ర విశేషాలతో టిడిపి నేత కేశినేని శివనాథ్(చిన్ని) ప్రత్యేక సంచిక తీసుకొచ్చారు. శ్రీశైలం నియోజకవర్గం బోయరేవుల క్యాంప్ సైట్ వద్ద సోమవారం యువనేత నారా లోకేష్ ప్రత్యేక సంచిక జనహృదయం నారా లోకేష్ ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, మాజీ మంత్రి రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి పీతల సుజాత, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి , శ్రీశైలం నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు, దూండి రాకేష్, యువగళం మీడియా కోఆర్డినేటర్ బీవీ. వెంకట రాముడు, భాష్యం ప్రవీణ్, టిడిపి నేతలు పాల్గొన్నారు.
Lokesh: పాదయాత్ర అరాచక సర్కారుపై జన జైత్రయాత్ర
సంబంధిత వార్తలు | RELATED ARTICLES