Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandavaram: TDP కంచుకోటకు బీటలు?

Nandavaram: TDP కంచుకోటకు బీటలు?

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటి నుంచి నందవరం మండలం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా నిలుస్తూ వస్తుందని చరిత్ర చెబుతోంది. అలాంటి కంచుకోట ఇప్పుడు బీటలువారునుందా అంటే అవుననే చెబుతున్నాయి మండలంలోని ప్రస్తుత పరిస్థితులు. వీటన్నిటికీ పార్టీలోని నాయకులు మధ్య అంతర్గత విభేదాలే కారణం అంటున్నారు పార్టీలోని కొందరు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. మండలంలో ఇటీవల తెదేపా యువ నాయకులు జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రివర్యులు నారా లోకేష్ యువ గళం పాదయాత్ర సందర్భంగా మండలం తెదేపా నాయకులలో జరిగిన కొన్ని సంఘటనలు పార్టీలోని అంతర్గత విభేదాలు ఉన్నాయన్న విషయాన్ని బహిర్గతం చేశాయి. ఇటీవల నారా లోకేష్ యువ గళం పాదయాత్ర సందర్భంగా కొన్ని సంవత్సరాలుగా పార్టీకి, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఒక వర్గాన్ని నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బి వి జయ నాగేశ్వర్ రెడ్డి తెదేపా మండల నాయకులు, కార్యకర్తలతో ఎలాంటి చర్చలు జరుపుకుండా చేరదీయడంతో తెదేపా జిల్లా ఉపాధ్యక్షులు నియోజకవర్గ క్లస్టర్ ఇంచార్జ్ గా బాధ్యతలు నిర్వహిస్తూ నందవరం మండల తెలుగుదేశం పార్టీ నాయకులలో ప్రధాన భూమిక పోషిస్తు పార్టీ ప్రతి కార్యక్రమంలో తనదైన శైలిలో కార్యక్రమాలను విజయవంతం చేస్తూ పార్టీలోని నాయకులను, కార్యకర్తలను కలుపుకుపోతూ ఉంటున్న ప్రధాన నాయకుడు బి వి తో విభేదించడంతో పార్టీలో అలజడులు అలుముకున్నాయి. సోమవారం రోజున బివి జయనాగేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గం లోని అన్ని మండలాల నాయకులు నారా లోకేష్ బాబు యువ గళం పాదయాత్ర వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా యువ గళం పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ నియోజకవర్గ కేంద్రం ఎమ్మిగనూరు పట్టణంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు కలిపి పది కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించిన కార్యక్రమానికి, అంతేకాకుండా ఇటీవల కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారాన్ని అందించాలంటూ ఇటీవల నందవరం మండలంలో నిర్వహించిన కార్యక్రమానికి బి వి తో విభేదించిన నందవరం మండలానికి చెందిన ఒక వర్గ నాయకుడు, ఆయన అనుచరులు, ఆయన సానుభూతి నాయకులు మండలంలో బి వి నిర్వహిస్తున్న కార్యక్రమాలకు కూడ దూరంగా ఉండడంతో బివి పై అసమ్మతి తారాస్థాయికి చేరిందని మండలంలోని కొందరు తెలుగుదేశం పార్టీ అభిమానులు చర్చించుకుంటున్నారు. వీటికి తోడు మండలంలోని తెదేపాకి సంపూర్ణ మెజార్టీని అందించే ప్రధాన గ్రామాలైన నందవరం, సోమలగూడూరు, కనకవీడు, పెద్దకొత్తిలి, హాలహర్వి, నది కైరవడి తదితర గ్రామాలలో పార్టీలోని ప్రధాన నాయకులు మధ్య వర్గ విభేదాలు చోటు చేసుకోవడంతో మండలంలో పార్టీ మనుగడకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని ఇది ఇలానే కొనసాగితే రానున్న ఎన్నికల్లో తెదేపా విజయం ప్రశ్నార్థకంగా మారుతుందని కావున ఇకనైనా నియోజకవర్గపు ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే బివి జయ నాగేశ్వర్రెడ్డి పార్టీలోని కొనసాగుతున్న విభేదాలను గుర్తించి పార్టీ కోసం శ్రమించే వారిని ఒకే తాటి పైకి తీసుకువచ్చి పార్టీని ముందుకు నడిపించాలని తెలుగుదేశం పార్టీ అభిమానులు కోరుకుంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News