Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Yuvagalam: యువగళంలో లోకేష్ తో సెల్ఫీలు

Yuvagalam: యువగళంలో లోకేష్ తో సెల్ఫీలు

గత మూడు రోజులుగా శ్రీశైల నియోజకవర్గంలో నారా లోకేష్ నిర్వహించిన యువగళం పాదయాత్ర సొమవారం ఉదయం 11.o6 గం లకు మండలంలోని పెద్దదేవలాపురం గ్రామ సమీపంలో ఏకశిలా ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర మండలంలోకి ప్రవేశించారు. 11.26 గం లకు పెద్దదేవలాపురం గ్రామము చేరుకుని మహిళలతో మాట్లాడి సెల్ఫీలు దిగి యాత్ర కొనసాగించారు. 12 .08 గం. లకు సంతజూటూరు గ్రామం చేరుకున్నారు. అనంతరం సంతజూటూరు విడిది కేంద్రంలో చెంచుల సమశ్యలపై చెంచులతో ముఖాముఖి నిర్వహించారు. ముందుగా శ్రీశైల నియోజకవర్గం మాజీ ఎమ్యెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ చెంచులను సర్పంచి ఎన్నికలలో పోటీ చేయకుండా చేయడం చేసిన వారిని ఐటిడిఎ అధికారాలతో బెదిరించి, బలవంతంగా విత్ డ్రాలు చేపించారన్నారు. 2019 ఎన్నికలలో రాష్ట్రమంతటా వైసిపీ మెజారిటీ రాగా చెంచు గూడేలలో మాత్రం తెలగుదేశం మెజారిటీ వచ్చిందని తెలియజేశారు.చెంచులు చేసి సహాయం మరవక నిజాయితితో ఓటు వేస్తారని అన్నారు. దాసరి వెంకటమ్మ మాట్లాడుతూ చంద్రన్న ప్రభుత్వంలో మాకు అన్నీ మంచిజరిగేవని ఈ ప్రభుత్వంలో జరగలేదని మాకులంలో పెళ్ళైన వారంలో తరిమేస్తే వారికి 35 కేజీల బియ్యం ఇచ్చేవారు ఇప్పుడు కార్డు మారలేదని చెప్పుచున్నారు .చంద్రన్న ప్రభుత్వంతో ఉపాధిపని ఐటిడిఎ వారు 2700 రూపాయలు ఇచ్చి పనిచేపించేవారు ఇప్పుడు జనరల్ చేసినారు జగన్ ప్రభుత్వం పేదలకు న్యాయం చేయడంలేదు ఉన్నవారికే చేస్తాడని తెలియజేసింది.
చెంచు లింగమ్మ మాట్లాడుతూ నాకు 6 ఎకరముల పొలము కలదు నాకు నీటిపారుదల పైపులు కావాలని ఐటిడిఎ అధికారులను కోరగా బడ్జెట్లేదని తెలిపారు మా ఆయనకు ఆరోగ్యం బాగాలేదు బాంక్ అప్పు నేను తీర్చలేను అనగా ఎమ్యెల్యే శిల్పా రేపు బాంక్ కు పో నీ అప్ప కొట్టివేస్తారన్నాడు తీరా బ్యాంకు కు పోగా నన్ను అప్పుకట్టమన్నారు .ఎమ్యెల్యే ఆఫీసుకు పోయి ఎమ్యెల్యేను అడగగా మీరు బర్రెల తినేవారు అని దూషించాడు అని తెలియజేయగా నారా లోకేశ్ మాట్లాడుతూ చేతనైతే పనిచెయ్యి కాకుంటే కాదని చెప్పు ఇలా దూషించడం సబబు కాదన్నాడు .మా ప్రభుత్వం వచ్చిన తరువాత మీకు అండగావుంటామని తెలియజేశారు .అనంతరం విడిదికేంద్రం నుండి సాయంత్రం 5 .05 బయలుదేరి 5 .15 లింగపురం క్రాస్ రోడ్డుకు చేరుకున్నాడు .5 .15 నుండి 6 .20 నిమిషాలకు బండిఆత్మకూరు చేరుకోని తెలగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి 6 30 గం లకు బండిఆత్మకూరు బస్ ష్టాండు చేరుకోని అనంతరం బండి ఆత్మకూరు రాత్రి బస కేంద్రానికి చేరుకున్నారు .

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News