Thursday, September 19, 2024
Homeతెలంగాణహరిత నగరంగా కరీంనగర్

హరిత నగరంగా కరీంనగర్


ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హరితహారం స్పూర్తితో కరీంనగర్ ను హరిత నగరంగా మార్చుతామని కరీంనగర్ నగర మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ 9వ డివిజన్ పరిధిలో గల మానేరు డ్యాం సమీపంలోని ఫిల్టర్ బెడ్ ప్రక్కన గత సంవత్సరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బృహత్ పట్టణ ప్రకృతి, రాశివనాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ సేవా ఇస్లావత్, స్థానిక కార్పొరేటర్ జంగిలి ఇలేందర్ యాదవ్, అధికారులతో కలిసి మేయర్ యాదగిరి సునీల్ రావు సందర్శించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన నర్సరీలను, ప్రకృతి వనంలో నాటిన వివిధ రకాల పండ్లు, పూలు, ఔషధ మొక్కలను పరిశీలించారు. మొక్కలు వేసవి తాపం నుండి తట్టుకునేలా మేయర్ యాదగిరి సునీల్ రావు స్వయంగా నాటిన మొక్కలు, నర్సరీ మొక్కలకు మోటారు పంపు సహాయంతో నీటి తడులు అందించారు. కాశీ వనంలో వివిధ రాశుల పేరుతో నాటిన మొక్కలతో పాటు స్థానికంగా ఏర్పాటు చేసిన గులాబీ, మల్లే, చేమంతి పూల తోటలను పరిశీలించారు. మండుటెండల్లో పట్టణ ప్రకృతి వనంలో కలియతిరుగుతూ ప్రతి మొక్క ఎదుగుదళను చూసి ఆనందం వ్యక్తం చేశారు. హరిత ప్రకృతి వనాల వాతావరణాన్ని ఆస్వాదిస్తూ గతంలో మేయర్ యాదగిరి సునీల్ రావు స్వయంగా నాటిన మొక్క నీడలో సేద తీరుతూ హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు చాలా ఇష్టమైన కార్యక్రమం హరితహారం అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన స్పూర్తితో కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో పట్టణ ప్రకృతి వనాలు, చిట్టడువులు, రాశి వనాలను ఏర్పాటు చేసి నిరంతరం వాటి నిర్వహణ బాధ్యతలు చేపడుతున్నట్లు తెలిపారు. పలు విడుతల వారీగా హరితహారంలో నగర వ్యాప్తంగా లక్షలాది మొక్కలను నాటడంతో పాటు 11 నర్సరీలను ఏర్పాటు చేశామన్నారు. ఏర్పాటు చేసిన నర్సరీలలో వచ్చే హరితహారంకు సరిపడా మొక్కలను పెంచుతున్నట్లు తెలిపారు. నగర ప్రజలకు పంపిణీ చేసేందుకు వివిధ రకాల పూలు, పండ్లు, ఔషధ మొక్కలను కూడా పెంచుతున్నట్లు తెలిపారు. మంత్రి గంగుల కమలాకర్, ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్ ల ప్రోత్సాహంతో నగరంలో చాలా చోట్ల పట్టణ ప్రకృతి వనాలు, చిట్టడవులు పెంచడం జరుగుతోందన్నారు.

అంతే కాకుండా నగరపాలక సంస్థ ఫిల్టర్ బెడ్ ప్రక్కన ఉన్న స్థలంలో గత సంవత్సరం బృహత్ పట్టణ ప్రకృతి, రాశి వనాలను ఏర్పాటు చేశామన్నారు. 12 ఎకరాల స్థలాన్ని చదును చేసి పట్టణ ప్రగతిలో భాగంగా ఆహ్లాదాన్ని పంచే చిట్టడవిని పెంచుతున్నట్లు తెలిపారు. గతంలో నాటిన వివిధ రకాల మొక్కలు, పూల తోటలు ఏపుగా పెరిగి పచ్చదనంతో మంచి వాతావరణాన్ని అందిస్తున్నాయని తెలిపారు. పెరిగన మొక్కలను చూస్తే మనసుకు ఎంతో ఉత్సహాన్ని కలిగించాయన్నారు. నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది సహాకారంతో చాలా కష్టపడి ప్రతిరోజూ వాటి నిర్వహణ బాధ్యతలు చేపట్టి వనాలను పెంచామన్నారు. ఈ వనంలో గులాబీ, మల్లే, చేమంతి తోటలతో పాటు జామ, అల్లనేరేడు, సీతాఫలం, మామిడి, పులుచింత, దానిమ్మ లాంటి పండ్ల మొక్కలు, వివిధ రకాల ఔషధ మొక్కలు పెంచుతున్నట్లు తెలిపారు.

అంతే కాకుండా ప్రత్యేకంగా వివిధ రాశుల పేరుతో రాశికి తగిన మొక్కలను పెంచి పెద్ద రాశివనం ఏర్పాటు చేశామన్నారు. 12 ఎకరాల స్థలంలో దాదాపు 30 నుండి 40 వేల మొక్కలతో ఆహ్లాదాన్ని పంచే అందమైన ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గతంలో నాటిన మొక్కలన్నీ ప్రకృతి వనంలో 15 ఫీట్లతో ఏపుగా పెరిగాయని, దీని వెనుక నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది కఠోర శ్రమ ఉందన్నారు.

పద్మనగర్ బుల్ సెమన్ స్థలంలో కూడా 50 వేల మొక్కలు నాటి చిట్టడవి ఏర్పాటు చేశామన్నారు. సదాశివ్ పల్లి, శాతవాహన యూనివర్సిటీ లాంటి ప్రాంతాల్లో కూడా వనాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో ఎక్కడ స్థలం అందుబాటులో ఉంటే అక్కడ గ్రీన్ కవర్ పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. పెరిగిన వనాలను చూసిన తర్వాత మాలో గ్రీన్ కవర్ పెంచడంపై ఇంకా ఆసక్తి పెరిగిందన్నారు.

ఇదే స్పూర్తితో వచ్చే హరితహారంలో కూడా మరిన్ని మొక్కలు, వనాలు పెంచి కరీంనగర్ ను హరిత కరీంనగర్ గా మార్చుతామన్నారు. వచ్చే హరితహారంలో నగర ప్రజలకు మా నర్సరీల్లో పెంచిన పండ్లు, పూల మొక్కలను పంపిణీ చేస్తామన్నారు. గత విడుతల్లో నగరంలో పంపిణీ చేసిన మొక్కలను ప్రజలు తమ ఇండ్లలో నాటి నగరపాలక సంస్థకు పూర్తిస్థాయిలో సహకరించారని తెలిపారు. హరిత కరీంనగర్ గా మార్చేందుకు నగర ప్రజలు కూడా తమ వంతు సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. పట్టణ ప్రకృతి వనాల్లో చుట్టూ వాకింగ్ ట్రాక్ లు కూడా ఏర్పాటు చేసి ప్రజలు వాకింగ్ చేసేలా, మంచి వాతావరణం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వాకింగ్ ట్రాక్ లు నిర్మించిన తర్వత వనాల్లోకి వాకర్స్, ప్రజలను అనుమతిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు ఈఈ మహేందర్, డీఈ ఓం ప్రకాష్, ఏఈ వాణీ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News