Saturday, October 5, 2024
HomeతెలంగాణEarthquake : సంగారెడ్డి జిల్లాలో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 3.6 తీవ్రతగా నమోదు

Earthquake : సంగారెడ్డి జిల్లాలో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 3.6 తీవ్రతగా నమోదు

సంగారెడ్డి జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున భూమి కంపించింది. తెల్లవారుజామున 3.20 గంటల సమయంలో కోహీర్ మండలం బిలాల్ పూర్ లో భూ ప్రకంపనలు సంభవించాయి. నిద్రావస్థలో ఉన్న ప్రజలు భూమి కదలికలతో ఉలిక్కిపడి.. ఇళ్లనుండి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6 గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది.

- Advertisement -

నల్గొండకు 117 కిలోమీటర్ల దూరంలో భూమికి 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించినట్లు వెల్లడించారు. ఈ భూప్రకంపనల్లో ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. కాగా.. గతేడాది జనవరిలోనూ కోహీర్ మండలంలోని పలు ప్రాంతాల్లో ఇలాగే భూ ప్రకంపనలు వచ్చాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News