నీళ్లు నిధులు నియామకాల్లో సమాన వాట కావాలంటూ రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో బనగానపల్లె పట్టణంలో కరపత్రాలు విడుదల చేసి సంతకాల సేకరణ చేశారు. ఈసందర్భంగా రాయలసీమ స్టీరింగ్ కమిటీ నాయకులు సీమకృష్ణ మాట్లాడుతూ నీళ్లు నిధులు నియామకాల్లో సమాన వాటా తేల్చి, రాయలసీమకు ఇవ్వాలని, అప్పర్ భద్ర ప్రాజెక్ట్ నిర్మిస్తే రాయలసీమకు హెచ్ ఎల్సి, ఎల్ఎల్సి- బైరవానితిప్ప ప్రాజెక్ట్, కెసి కెనాల్ కి నీళ్లు రావని అన్నారు. రాయలసీమ ఎడారిగా మారుతుందన్నారు. సిద్దేశ్వరం, సంగమేశ్వరం వద్ద ఐకానిక్ బ్రిడ్జి బదులు రొడ్ కమ్ బ్యారేజ్ నిర్మించాలన్నారు. రాయలసీమ వ్యాప్తంగా సంతకాల సేకరణ చేసి, రాయలసీమ స్టీరింగ్ కమిటి చైర్మన్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో అమరావతిలో రాయలసీమ కర్తవ్య దీక్ష చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాము, గంగాధర్, గోపాల్, నాగభూషన్ తదితరులు పాల్గొన్నారు.
Banaganapalli: నీళ్లు, నిధులు, నియామకాలకై రాయలసీమ పోరుబాట
సంబంధిత వార్తలు | RELATED ARTICLES