Friday, September 20, 2024
HomeతెలంగాణKonaraopeta: గ్రామీణ క్రీడాకారుల కోసమే సీఎం కప్

Konaraopeta: గ్రామీణ క్రీడాకారుల కోసమే సీఎం కప్

గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సీఎం కప్ క్రిడల పోటీలను నిర్వహిస్తున్నట్లు కోనరావుపేట జెడ్పి చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి రెడ్డి అన్నారు. కోనరావుపేట మండల కేంద్రంలో మండల స్థాయి సీఎం కప్ -2023 ను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహిస్తూ, సీఎం కప్-2023 ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. గ్రామాలకే పరిమితమవుతున్న క్రీడాకారులను వారి నైపుణ్యలను బట్టి జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఎంపిక చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్, సర్పంచ్ పొకల రేఖ సంతోష్, ఎంపీటీసీ చారి, కొలనూర్ పాక్స్ ఛైర్మన్ సంకినెని రామ్మోహన్ రావు, ఎంపిడిఓ రామకృష్ణ, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు న్యాలకొండ రాఘవరెడ్డి, అగ్రహారం హనుమాన్ దేవస్థానం డైరెక్టర్ సతీష్, నాయకులు రమణారెడ్డి, నాయకులు, క్రీడకారులు, యువకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News