కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బాలాజీ నగర్ డివిజన్ లోని JNNURM కాలనీ లో పరిశీలించారు. గత పాలకుల హయాంలో నాణ్యతా లోపంతో నిర్మించిన భవనాలు పూర్తి శిథిలావస్థకు చేరి, వర్షం వచ్చినప్పుడు నీరు ఇళ్లల్లోకి చేరడమే కాక కూలిపోయే దుస్థితి ఏర్పడింది. దీంతో అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకుని వారికి తగిన పరిష్కారం చూపే విధంగా ఇళ్ల మరమ్మతు పనులు చేపట్టారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ ఇల్లులు పూర్తి నాణ్యత లోపంతో నిర్మించడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని, ఇక్కడ ప్రజలకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు. అలాగే ఈ ఇళ్లను కిరాయికి ఇచ్చి వారు వేరే ప్రాంతంలో ఉంటే ఎవరైతే ఇంట్లో కిరాయికి ఉంటున్నారో వారికి ఇల్లు అప్పగిస్తామని గట్టి సందేశం పంపారు. నిరుపేదలని గుర్తించి వారికి ఇల్లు ఇస్తే వారు కిరాయికి ఇచ్చుకోవడం సమంజసం కాదని హెచ్చరించారు. దీన్ని తీవ్రంగా పరిగణిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పగుడాల శిరీష బాబురావు, డివిజన్ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, EE సత్యనారాయణ, DE ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.