జూపాడు బంగ్లా మండలంలోని మండ్లెం, తంగడంచ, గ్రామాల పరిధిలో ఉన్న 5 వేల ఎకరాల మెట్ట భూములకు కృష్ణ జలాలు తక్షణమే అందించాలని, లిఫ్ట్ ఏర్పాటు చేసి సాగునీరు అందించేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని న్యాయం జరిగేంత వరకు ఉద్యమాన్ని ఆపేది లేదన్నారు. నందికొట్కూరు నియోజకవర్గ రైతులకు కృష్ణా జలాలు హక్కని గ్రామ రైతులు అన్నారు. మండ్లెం గ్రామ రైతులు జలదీక్ష 22 రోజుకి చేరుకుంది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు సాగునీటి విషయంపై పట్టించుకోవడం లేదన్నారు. జిల్లా కలెక్టర్, సాగునిటి అధికారులు స్పందించి మండ్లెం గ్రామ రైతాంగానికి లిఫ్ట్ ఏర్పాటు చేసి సాగునీరు అందించాలని లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. చలో కలెక్టరేట్ కు ముట్టడిస్తామని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రైతులు సురేషు, అరుణ్, శివప్రసాద్, శ్రీను, రంగస్వామి నాగరత్నం, భాస్కర్, అశోక్, గజేంద్ర, సుదర్శనం, రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Jupadubangla: 22వ రోజుకు చేరిన జల దీక్ష
సంబంధిత వార్తలు | RELATED ARTICLES