Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Judiciary: స్పష్టత కొరవడుతున్న తీర్పులు

Judiciary: స్పష్టత కొరవడుతున్న తీర్పులు

‘ధర్మో రక్షతి రక్షితః శతాబ్దాలుగా భారతీయ సమాజాన్ని ప్రపంచపు అగ్రభాగంలో నిలిపి ఉంచిన మూలసూత్రమిది. భారత రాజ్యాంగంలో న్యాయ వ్యవస్తకు అగ్రపీటం వేయడం వెనుక ఉన్న ప్రధాన కారణం కూడా ఇదే. దశాబ్దాల చరిత్రలో అన్ని వ్యవస్థలూ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్నా న్యాయవ్యవస్థ ఇంకా ప్రజల విశ్వాసాన్ని చూరగొంటున్నది అంటే కృష్ణయ్యర్‌, భగవత్‌, రాజేందర్‌ సచార్‌, మహదేవ్‌ గోవింద రణడే, హన్స్‌ రాజ్‌ ఖన్నా, వై.వీ. చంద్రచూడ్‌ లాంటి ఎందరో మహోన్నత న్యాయమూర్తులు తమ తీర్పుల ద్వారా వివిధ వర్గాలకు కల్పించిన రక్షణ, అక్రమార్కుల మీద రుళిపించిన కొరడా, తప్పుడు నిర్ణయాలను ప్రశ్నించడం లో చూపిన తెగువ అని చెప్పవచ్చు. కొండల్లా పెరిగిపోతున్న పెండింగు కేసులను సాకుగా చూపిస్తూ ఈ మధ్యకాలంలో యాంత్రికంగా వస్తున్న తీర్పులను చూస్తుంటే నాటి మహనీయుల ఆత్మలు శోబిస్తున్నాయా అనిపిస్తుంది. న్యాయమూర్తులు తాము ఏ ఆలోచనతో ఏకీభవించి, ఏ విషయంలో సంతృప్తి చెంది లేక ఏ కారణం చేత అంతిమ నిర్ణయానికి వచ్చారో సవివరంగా తమ తీర్పులలో చెప్పగలిగితే ఇరు వర్గాలు (వాది-ప్రతి వాది) సంతృప్తి చెందుతాయి, ఓడిపోయిన కక్షిదారు పై కోర్టుకు వెళ్ళాలా వద్దా ఖచ్చితంగా నిర్ణయించుకోగలుగు తాడు. తీర్పుల అంతిమ ఉద్దేశ్యం న్యాయం చేయడమే కాదు న్యాయం చేసినామని ప్రకటించగలగడం కూడా. రెవెన్యూ అధికారుల తీర్పుల వలె కొందరు న్యాయ మూర్తుల తీర్పులు కూడా సంక్షిప్తంగా ఉండటం దురదృష్ట కరం. నేడు కొందరు న్యాయమూర్తుల తీర్పులను పరిశీ లిస్తే ఓడిపోయిన కక్షిదారులు తామెందుకు ఓడిపో యామో, పొరపాటు ఎక్కడ జరిగిందో తెలియకుండా మదనపడుతున్నారు. గెలిచిన వారి పరిస్థితి కూడా ఇంచు మించు అలాంటిదే.
న్యాయవాదుల వాదనలకు తీర్పులలో స్థానమే ఉం డటం లేదు. చాలా సందర్భాలలో న్యాయవాదుల వ్రాత పూర్వక వాదనలు కూడా తీర్పులలో చర్చకు రావడం లేదు. న్యాయవాదులు వాదనల సమయంలో, వివిధ సంద ర్భాలలో ఇచ్చిన పూర్వ నిర్దేశిత తీర్పులను (ప్రిసిడేంట్‌ ) తమ తీర్పులలో ఉటంకించడం గాని, వాటిని తిరస్కరించ డానికి గల కారణాలు తెలియజేయడం కాని చేయడం లేదు. పుల్ల విరిచినట్లు కేవలం ఒక్క మాటలో అవి ప్రస్తుత కేసులో అప్రస్తుతాలంటూ తిరస్కరిస్తున్నారు. పై పెచ్చు న్యాయమూర్తులే వారికి తెలిసిన పూర్వ నిర్దేశిత తీర్పులను (ఉన్నత న్యాయస్థానాల తీర్పులను) తమ తీర్పులలో ఉటంకిస్తూ తమ ఉద్దేశ్యాలకు, తీర్పులకు బలాన్నిచ్చే ఆయుదాలుగా వాడుకుంటున్నారు. ఇదేంటని ప్రశ్నించే న్యాయవాదులతో సౌమ్యంగా మీకు అప్పీలు లేదా రివిజన్‌ చేసుకునే అవకాశం ఉన్నది కదా, అంటూ సాగదీస్తూ చెబుతున్నారు. నిజమే ఓడిపోయిన కక్షిదారుకు మరో అవకాశం ఉన్నది. కానీ దానివలన కక్షిదారు మీద పడే అదనపు భారం, వారు అనుభవించే మానసిక క్షోభ, ఆయా న్యాయవాదులకు కలిగే అపప్రద లెక్కలోనికి రానిదా? తీర్పులు వీలయినంత స్పష్టంగా, వివరంగా ఉంటే ఇరు పక్షాలు తమ తప్పొప్పులు, బలాబలాలు తెలిసికోవడానికి, తమను తాము సమాధానపరుచుకోవడానికి ఆస్కారముం టుంది. బహుళ వాజ్యాలకు (విభిన్న కేసులకు) అవకాశం తగ్గుతుంది. లేనిపక్షంలో దిగువ న్యాయస్థానాలలో కేసుల సంఖ్య తగ్గిపోతుందేమో కాని అప్పీలు లేదా రివిజన్‌ల రూపంలో ఆయా వాజ్యాలు పై న్యాయస్థానాలలో మళ్ళీ పేరుకుపోతూనే ఉంటాయి.
పరిపాలనా విభాగంలోని అధికారులు ఉపయోగించే విచక్షణా అధికారానికి, న్యాయమూర్తుల విచక్షణా అధి కారానికి ఏంటో వ్యత్యాసమున్నది. దురదృష్టవశాత్తు ఆ తేడా నేడు కనుమరుగైపోతున్నది. న్యాయమూర్తులు తాము చివరివరకు ఇరుపక్షాల వాదనలు వింటూ నిష్పాక్ష పాతంగా ఉండాల్సింది పోయి, కేసు మొదలైన మొదటి రోజే ఒక అభిప్రాయానికి వచ్చి, తన అభిప్రాయానికి అనుగుణంగా న్యాయపరిధిలో పరిస్థితులను అన్వయించు కుంటూ తీర్పులు ఇస్తున్నారని పరిస్థితులు చెప్పకనే చెబు తున్నాయి. ఈ విధమైన ముందస్తు అభిప్రాయం న్యాయ వ్యవస్థ భవిష్యత్తుకే ప్రమాదకరం. ఎందరో ఉన్నత న్యాయ మూర్తులు వాదనల చివరినిముషంలో కూడా సంతృప్తులై తమ తీర్పులలో విస్పష్టంగా అట్టివిషయాన్ని విశదీకరించిన దాఖలాలు మన న్యాయవ్యవస్తలో ఎన్నో ఉన్నాయి. వారిని ఆదర్శంగా తీసుకునే వారెంతమంది! న్యాయవాదులు న్యాయమూర్తుల తీర్పులకు దార్శనీకులని ఎంతోమంది న్యాయకోవిదులు, నిష్ణాతులు ఉపదేశించారు. అందుకు విరుధ్ధంగా నేటితరం న్యాయమూర్తులు కొందరు తమకు తెలిసిందే ఎక్కువ అన్నట్లు, న్యాయవాదులంతా తమను తప్పుదారి పట్టించడానికే ప్రయత్నిస్తారన్నట్లు స్థిర భావన తో వ్యవహరిస్తుండటంతో సువిశాల న్యాయస్థానాలు కూడా ఇరుగ్గా కనిపిస్తున్నాయి. ప్రముఖ అమెరికా న్యాయ మూర్తి ‘ఫ్రాంక్‌ ఫర్టర్‌’ గారి మాటల్లో చెప్పాలంటే న్యాయ మూర్తులు వ్యక్తులుగా, న్యాయస్థానంగా విమర్శలకు అతీ తులు కారు. మిగతా వర్గాలకు భిన్నంగా ఎటువంటి ప్రత్యేక రక్షణ పొందలేరు. న్యాయాన్ని ప్రకటించే స్థానంలో ఉన్నారు కనుక వారు తమ సహజ మానవ బలహీనతలను మరచిపోతారని అనటిము. అత్యున్నత న్యాయవిలువలను ప్రకటించిన న్యాయమూర్తులు కూడా హోదా, గౌరవం: బాటులో రాజీపడిన సందర్భాలు ఉన్నాయి. అందువల్లనే న్యాయనిర్ణేతలు వారి అధికార పరిమితుల మీద, ప్రజా బాహుళ్యం మీద వారి తీర్పుల ప్రభావం పట్ల అవగాహన, జాగ్రత్తను కలిగి ఉండాలి, విజ్ఞత తో కూడిన విమర్శలు ఎంత పదునైనవి అయినా కూడా స్వీకరించడానికి సిద్దంగా ఉండాలి.
తీర్పు ఇవ్వడమంటే ఒక్క ముక్కలో పుల్లవించినట్లు న్యాయమూర్తి తన అభిప్రాయాన్ని నిర్ణయాన్ని తెలియ జేయడం కాదు. సవివరమైన కారణాలతో, న్యాయ సూత్రాల పరిధిలో తన నిర్ణయాన్ని తెలియజేయడం. (ఆర్థర్‌ 20, రూల్‌ 5 సి.పి.సి) అంతిమ తీర్పు అంటే సమస్యలో ఒకవైపు నిలవడం కాదు, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం, వాజ్యంలోని ప్రాథమిక మరియు ప్రధాన అంశం మీద స్పష్టమైన వివరణతో కూడిన అభి ప్రాయాన్ని, నిర్ణయాన్ని చెప్పకుండా ఇచ్చే తీర్పు న్యాయ పరిభాషలో తీర్పు కానే కాదని సుప్రీం కోర్టు అర్ణిత్‌ దాస్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ బిహార్‌లో స్పష్టంగా చెప్పింది. తీర్పులలో స్పష్టత, వివరణ ముఖ్యంగా గెలిచిన పక్షానికంటే ఓడిన వారికి, వారి న్యాయవాదులకు ఎంతో అవసరం. తమ లోతుపాట్లను గుర్తించి, సమస్య మీద అవగాహనతో, పొరపాట్లను దిద్దుకోవడానికి, తీర్పులోని ఎత్తుపల్లాలను పై న్యాయస్థానాలలో ప్రశ్నిచడానికి సవివరమైన తీర్పులు అత్యావశ్యకం. లేనట్లయితే కింది న్యాయస్థానాలలో తీర్పు లు మాత్రమే వస్తాయి, సమస్యలు మాత్రం అలాగే మిగిలి పోతాయి. అప్పీళ్ళు, పునర్విమర్శ (రివిజన్‌) రూపంలో తిరిగి ప్రత్యేక్షమౌతాయి.
సాధారణంగా న్యాయమూర్తులే స్వయంగా శోదించి, పూర్వ నిర్దేశిత తీర్పులను (ప్రిసిడెంట్‌ ) తమ: తీర్పులలో ఉటంకించడంమంటూ జరుగదు. అది సంప్రదాయం కూడా కాదు. ఒకవేళ కేసు ప్రాధాన్యత దృశ్యా, -స్పష్టత కొరకు అలా చేయాలని సదరు న్యాయమూర్తి భావిస్తే సంబంధిత వాది, ప్రతివాదులకు లేదా వారి న్యాయవాదు లకు సదరు పూర్వనిర్దేశిత తీర్పుల ప్రతులను అందజేసి, వారి వాదనలు, వివరణలను విన్న తరువాతనే సదరు పూర్వనిర్దేశిత తీర్పులను తన తీర్పులో ప్రస్తుతించాలన్నది న్యాయమూర్తులకున్న కట్టుబాటు. శ్రీ దుర దృష్టవశాత్తు నేడు కొందరు న్యాయ మూర్తులు ముఖ్యంగా దిగువ న్యాయస్థానాల్లోని న్యాయ మూర్తులు సంబంధిత న్యాయ వాదుల ప్రమే యమే లేకుండా, తమ తీర్పులలో ఆయా తీర్పులకు అనుకూలమైన పూర్వ నిర్దేశిత తీర్పు లను తామే సేకరిస్తూ, ఉటంకిస్తూ తీర్పులు ఇచ్చేస్తున్నారు. వారి ఉద్దే శాలను తప్పు పట్టలేము, కాని ఫ్రాంక్‌ ఫర్ట్‌ గారన్నట్లు సహ జ మానవ బలహీనతలకు వారు అతీతులు కారు కదా! రేపటి రోజు వారు ఆధారపడిన పూర్వ నిర్దేశిత తీర్పు ప్రస్తుత తీర్పుకు సరిపోనిదని తేలితే, లేదా ఓవర్‌ రూల్‌ అయిందని తేలితే సదరు కక్షిదారుకు జరిగిన మానసిక వేదనకు, ఆర్ధిక భారానికి జవాబుదారి ఎవరు? న్యాయ వాదులకు, న్యాయమూర్తులకు మద్య పెరుగుతున్న అం తరం అంతిమంగా న్యాయవ్యవస్థ బలహీనతకు దారి తీయదా? ప్రముఖ న్యాయకోవిదులు లార్డ్‌ టెంపుల్‌ టన్‌ అన్నట్లు తీర్పులను బట్టి మూడు రకాల న్యాయమూర్తులు న్నారీవ్యవస్థలో, కృష్ణయ్యర్‌ లాంటి తత్వవేత్తలు, జస్టిస్‌ భగవతీ లాంటి సామాజిక శాస్త్రవేత్తలు, మూడో రకం న్యాయమూర్తుల ముసుగులో ఉన్న న్యాయ వాదులు నిరంతరం వారి తీర్పులలో బలమైన వాగ్దాటి నీడలు అగుపిస్తాయి. కానీ నేడు ఇవేమీ కానరాని యాంత్రి కమైన తీర్పుల నిచ్చే నాలుగోతరం న్యాయ మూర్తులు కూడా ప్రత్యేక్ష మౌతున్నారని భయం వేస్తుంది. వేగం కన్నా ప్రాణం మిన్న.. రహదారుల్లో విరివిగా అగుపించే నినాదం, ఇదే సూత్రం న్యాయస్థానాలకు కూడా వర్తి స్తుంది. తీర్పుల్లో వేగం కన్నా విస్పష్టత మిన్న. చాలీ చాలని న్యాయస్థానా లతో, సరిపడని న్యాయమూర్తుల సంఖ్యతో కొండల్లాంటి కేసులను ఆగమేగాలమీద పూర్తిచేయాలని కంకణం కట్టు కోవడానికి బదులు, న్యాయస్థానాలు, న్యాయమూర్తుల సంఖ్యను పెంచుకుంటూ, తీర్పుల నాణ్యత తగ్గకుండా చర్యలు తీసుకుంటేనే న్యాయవ్యవస్త తన ప్రత్యేకతను నిలుపుకుంటుంది.

  • చందుపట్ల రమణ కుమార్‌ రెడ్డి.
    న్యాయవాది
    9440449392
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News