ఎట్టకేలకు కుదిరిన డీల్ అంటూ కాంగ్రెస్ పార్టీ హాయిగా ఊపిరి పీల్చుకుంది. కర్నాటక సీఎంగా సిద్ధరామయ్య, డిప్యుటీ సీఎంగా డీకే శివకుమార్ పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. దీంతో 5 రోజుల తరువాత కర్నాటక రాజకీయాలు ఓ గాటున పడ్డట్టయ్యాయి. ఓట్ల లెక్కింపు తరువాత నుంచి ప్రారంభమైన హై డ్రామాలకు తెరపడింది. పీసీసీ చీఫ్ గా డీకే శివకుమార కొనసాగుతూనే డిప్యుటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.
సిద్ధూ, డేకే ఇద్దరూ రెండున్నరేళ్లపాటు కర్నాటక సీఎంలుగా కొనసాగనున్నారు. ఈనెల 20వ తేదీన కొత్త సర్కారు కొలువుదీరనుండగా ఇప్పటికే కేబినెట్ ను ఎంపిక చేసే ప్రక్రియను హైకమాండ్ పూర్తిచేసింది. అయితే ఈ తాజా నిర్ణయంతో డీకే శివకుమార్ పూర్తి సంతోషంగా లేరని, కేవలం పార్టీ కోసమే అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఈ మేరకు అంగీకరించినట్టు డీకే శివకుమార్ సోదరుడు వెల్లడించారు.