Saturday, November 23, 2024
HomeతెలంగాణCabinet meeting: 111 జీవో పూర్తిగా ఎత్తివేత‌

Cabinet meeting: 111 జీవో పూర్తిగా ఎత్తివేత‌

111 జీఓ పూర్తిగా ఎత్తివేస్తూ కేబినెట్ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు మంత్రి హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు. 84 గ్రామాల ప్రజలు ఎంతో విజ్ఞప్తి చేస్తున్నారు. ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నార‌ని హ‌రీశ్‌రావు తెలిపారు. 111 జీఓ పూర్తిగా ఎత్తివేస్తూ కేబినెట్ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు మంత్రి స్ప‌ష్టం చేశారు. 84 గ్రామాల ప్రజలు ఎంతో విజ్ఞప్తి చేస్తున్నారు. ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నార‌ని హ‌రీశ్‌రావు తెలిపారు. హెచ్ఎండీఏ భూముల వలే, ఈ గ్రామాలకు కూడా అవే రూల్స్ ఉంటాయి. హిమాయత్ సాగర్, గండిపేట జలాశయాలు కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామ‌న్నారు. వీఆర్ఏల‌ను అంద‌ర్నీ రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయం. విధివిధానాలు ఖరారు చేయాలని సీసీఎల్ఏ న‌వీన్ మిట్టల్‌కు ఆదేశాలు జారీ చేసిన‌ట్లు తెలిపారు. రెండో విడత గొర్రెల పంపిణీ 15 రోజుల్లో ప్రారంభించాలని నిర్ణయించిన‌ట్లు పేర్కొన్నారు.

- Advertisement -

ఆరోగ్య శాఖలో రీ ఆర్గనైజింగ్‌లో భాగంగా 33 జిల్లాలో డీఎంహెచ్‌వో పోస్టులను మంజూరు చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ పట్టణ జనాభాకు మరింత వైద్య సేవలు అందేలా జీహెచ్ఎంసీ ప‌రిధిలోని 6 జోన్లకు అనుగుణంగా 6 డీఎంహెచ్‌వోలు ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. రాష్ట్రంలో మొత్తం 38 డీఎంహెచ్‌వోలు పని చేస్తారు. 40 మండలాల్లో కొత్త పీహెచ్‌సీలు మంజూరు చేయాలని నిర్ణయించిన‌ట్లు హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. అర్బన్ పీహెచ్‌సీల‌లో ఇప్పటి వరకు కాంట్రాక్టు ఉద్యోగులు పని చేస్తున్నారు. పర్మినెంట్‌గా ఉద్యోగులను తీసుకోవాలని నిర్ణయించామ‌ని తెలిపారు.

త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, గంగుల క‌మ‌లాక‌ర్‌, ప్ర‌శాంత్ రెడ్డి, మ‌ల్లారెడ్డితో క‌లిసి హ‌రీశ్‌రావు కేబినెట్ నిర్ణ‌యాల‌ను మీడియాకు వెల్ల‌డించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News