ఇంటర్నెట్లో పోస్టల్ కస్టమర్ కేర్ నంబర్ కోసం వెతికితే, సైబర్ మోసగాళ్లు రకరకాల నంబర్లు ఇచ్చి వారికి కాల్ చేయగా పోస్టల్ డిపార్టుమెంటు అంటూ మాయమాటలు చెప్పి మీకు మెసేజ్ చేయడం గాని, లింక్స్ పంపి వాటిని ఓపెన్ చేయమని చెప్పడం ద్వారా మీ డబ్బులు లాగేస్తారాని, ఇటువంటి సైబర్ మోసగాల్ల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే సోషల్ మీడియా వేదికల ద్వారా వచ్చే అనధికారిక ప్రకటనలను మరియు పోస్టల్ కస్టమర్ కేర్ నెంబర్, ఇతరత్ర కస్టమర్ కేర్ నంబర్ల కోసం గూగుల్ లో సెర్చ్ చేసి వాటిని నమ్మి మోసపోకండి అన్నారు.
పైవిధంగా ఎవరైనా మిమ్మల్ని సంప్రదిస్తే వెంటనే వారు చేసిన అనధికారిక పోస్టర్లు లేదా ప్రకటన లింక్స్ లను స్క్రీన్ షాట్స్ తీసి 1930 కి ఫోన్ చేయడం ద్వారా గాని లేదా www.cybercrime.gov.in వెబ్సైట్లో లాగిన్ అయ్యి గాని లేదా సైబర్ క్రైం పోలీసులకు గాని సమాచారం ఇవ్వగలరు అని తెలిపారు.
Mahabubabad: పోస్టల్ కస్టమర్ కేర్ నెంబర్ కోసం వెతుకుతున్నారా?
సంబంధిత వార్తలు | RELATED ARTICLES