Friday, September 20, 2024
HomeతెలంగాణJagityala: కలెక్టర్ నే మార్చేశారు !

Jagityala: కలెక్టర్ నే మార్చేశారు !

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ స్టేజి వెనుక కట్టిన ఫ్లెక్సీలో ప్రస్తుత కలెక్టర్ యాస్మిన్ భాషా ఫోటోకు బదులుగా గతంలో కలెక్టర్ గా పనిచేసిన గగులోతు రవి ఫోటో ఉంది. అయితే కొత్తగా చేయించిన ఫ్లెక్సీలో తప్పిదం దొర్లిందా లేక పాత ఫ్లెక్సీనే కార్యక్రమంలో ఏర్పాటు చేశారా అనేది తెలియవలసి ఉంది. స్థానిక ఎమ్మెల్యే, జెడ్పిటిసి, ఎంపిటిసిలు, సర్పంచులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో అటు అధికారులతో పాటు రాజకీయ నాయకులు ఎవరు కూడా ఈ తప్పిదాన్ని గుర్తించ లేదు. ప్రభుత్వ కార్యక్రమంలో తప్పిదాలు జరగకుండా చూసుకోవలసిన అధికారుల తీరుపట్ల సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News