Saturday, November 23, 2024
HomeతెలంగాణJublihills: ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలనేదే కేసీఆర్ ఆశయం

Jublihills: ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలనేదే కేసీఆర్ ఆశయం

ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయం అని, అందుకోసమే కోట్లాది రూపాయలతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించడం జరిగిందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాగంటి గోపినాథ్ అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ కమలానగర్ లో నిర్మించిన 210 కమలానగర్ 2 బి హెచ్ కే డబుల్ బెడ్ రూమ్ డిగ్నిటీ కాలనీని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి జూబ్లీహిల్స్ ఎమ్మేల్యే, భారత రాష్ట్ర సమితి హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపినాథ్ ఎమ్మెల్సీలు వాణి దేవి, మీర్జా రహమత్ బైగ్ లతో కలిసి ప్రారంభించి లబ్ధధారులకు పొజిషన్ సర్టిఫికెట్ తో పాటు ఇంటి తాళంచేయిని అందించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గోపినాథ్ మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకులకు పేదవాడి జీవితాలతో రాజకీయం చెయ్యడం తప్ప ఇంకా ఏమి చాతకాదని డబుల్ బెడ్ రూమ్ లు ఎక్కడ కట్టారో చూపించమని ప్రతిపక్ష నాయకులు అంటున్నారని వారికి కళ్ళు ఉంటె ఇక్కడికి వచ్చి చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ వసంత, ఎంఆర్ఓ నవీన్, హౌసింగ్ అధికారులు వెంకట్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు సి ఎన్ రెడ్డి, రాజకుమార్ పటేల్, దేదీప్య రావు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News