Friday, September 20, 2024
Homeచిత్ర ప్రభRetiesh Deshmukh : అభిమాని కాళ్ళు పట్టుకున్న హీరో.. ఏడ్చేసిన అభిమాని..

Retiesh Deshmukh : అభిమాని కాళ్ళు పట్టుకున్న హీరో.. ఏడ్చేసిన అభిమాని..

- Advertisement -

Retiesh Deshmukh : అభిమానులు తమ ఫేవరేట్ హీరోలు, సెలబ్రిటీలు కనిపిస్తే హగ్ చేసుకోవడమో, ఎమోషనల్ అవ్వడమే చేస్తారు. కొంతమంది ఇటీవల వాళ్ళ కాళ్ళ మీద కూడా పడుతున్నారు. గతంలో హ్రితిక్ రోషన్ కాళ్ళ మీద ఓ అభిమాని పడి దండం పెడితే హృతిక్ కూడా ఆ అభిమాని కాళ్ళ మీద పడి నమస్కారం చేశాడు. తాజాగా మరో బాలీవుడ్ హీరో కూడా ఇదే పని చేశాడు.

బాలీవుడ్ హీరో రితేష్‌ దేశ్‌ముఖ్‌ తన భార్య జెనీలియాతో కలిసి వేద్ అనే సినిమాలో నటించాడు. మరాఠీలో తెరకెక్కుతున్న వేద్ సినిమా మన తెలుగు మజిలీ సినిమాకి రీమేక్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా డిసెంబర్ 30న రిలీజ్ చేయనున్నారు. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు.

తాజాగా వేద్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రితేష్ దేశముఖ్ ఒక కాలేజీకి వెళ్లి అక్కడి అభిమానులతో ముచ్చటంచారు. ఇందులో భాగంగా రితేష్ అభిమాని అయిన ఓ యువతి రితేష్ కి తను గీసిన రితేష్ బొమ్మలని గిఫ్ట్ గా ఇచ్చి తనతో డ్యాన్స్ చేయాలని ఉందని అడిగింది. దీనికి ఒప్పుకున్న రితేష్ ఆ యువతితో కలిసి డ్యాన్స్ చేశాడు. దీంతో ఆ యువతి ఎమోషనల్ అయి ఏడుస్తూ రితేష్ కాళ్ళకి దండం పెట్టింది. ఆమెని లేపి రితేష్ కూడా ఆ యువతి కాళ్ళకి దండం పెట్టాడు. అనంతరం ఆ లేడీ ఫ్యాన్ ఏడుస్తూ రితేష్ ని హగ్ చేసుకుంది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News