Saturday, November 23, 2024
HomeతెలంగాణRamgundam: సిబ్బందికి అవగాహనా సదస్సు

Ramgundam: సిబ్బందికి అవగాహనా సదస్సు

రామగుండం పోలీస్ కమీషనర్ రెమా రాజేశ్వరి, ఐపిఎస్ (డీఐజీ) ఆదేశాల మేరకు జైపూర్ ఏసీపీ, ఫంక్షనల్ వర్టికల్ ఇంచార్జ్ అధికారి జి.నరేందర్ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ లకి సంబందించిన టెక్ టీమ్ వర్టికల్ ఆఫీసర్స్, సైబర్ వారియర్స్ (సైబర్ క్రైమ్స్ వర్టికల్) హెచ్.ఆర్.ఎమ్.ఎస్ వర్టికల్ కి సంబందించిన సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. 2023 మార్చి నెల పనితీరు, భవిష్యత్తులో పనితీరు మెరుగుదలకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై సైబర్ క్రైమ్ పిటిషన్లపై పిటిషన్ నిర్వహణ వ్యవస్థలో పనితీరు, పెండింగ్‌లో ఉన్న యూఐ సైబర్ క్రైమ్ కేసులను క్లియర్ చేయాలి, సీసీటీఏన్ఎస్ లో అన్ని సైబర్ నేరాలలో అప్‌లోడ్ చేయబడిన ఐఆర్ ల గురించి, సైబర్ అవగాహన కార్యక్రమాలను ఏవిదంగా నిర్వహించాలి, ప్రజలలో ఎలా చైతన్య పరచాలి. సీసీటీఏన్ఎస్ వెర్షన్-2.0 వినియోగం, టిఎస్ కాప్ మొబైల్ అప్లికేషన్ ద్వారా నేరా స్థలంను సందర్శించి అక్కడి నుండే సంఘటన ఫోటో లు, వీడియోలు రికార్డు చేసి నేరానికి సంబందించిన సాక్ష్యాదారాలు అప్డేట్ చేయవచ్చు. నేరా పరిశోధన వేగవంతం చేయడానికి ఈ శిక్షణ దోహద పడుతుంది. హెచ్.ఆర్.ఎమ్.ఎస్ పనితీరు తదితర అంశాలపై పోలీస్ సిబ్బందికి వివరించడం జరిగింది. ఇందులో భాగంగా వర్టికల్ ఇంఛార్జి ఆఫీసర్ ఎసిపి జైపూర్ గారు మాట్లాడుతూ… తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ శాఖ ఉపయోగించే టెక్నీకల్ ఇన్నిటిఏటివ్స్ గురించి తెలుసుకుని వాటికి సంబందించిన అన్ని అప్లికేషన్స్ ని సరియైన విధంగా ఉపయోగిస్తూ అవగాహన కలిగి ఉండాలని, నేరస్థులను పట్టుకోవడంలో ఉన్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని, సాంకేతిక సమస్యలను తొలి దశలోనే గుర్తించి పరిష్కరిస్తూ స్టేషన్ కి సంబందించిన నేర సమాచారాన్ని ఎప్పటికప్పుడు నమోదు చెయ్యటం వంటి విధులు ప్రతిభావంతంగా నిర్వహించుటలో ముఖ్యపాత్రపోషించాల ని సూచించారు. హెచ్.ఆర్.ఎమ్.ఎస్ అప్లికేషన్ లోని అన్ని మ్యాడ్యూల్స్ గురించి వివరించడం జరిగింది. సిబ్బంది యొక్క సర్వీసు వివరాలు అన్ని రకాల సెలవులు, రివార్డులు, ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ గ్రేవియన్స్ మొదలగు వాటిని సదరు సిబ్బంది ఉన్న చోటు నుండి అప్లై చేసుకునే విధానం మరియు స్టేటస్ తెలుసుకునే విధానం గురించి క్లుప్తంగా వివరించారు. సైబర్ సెక్యూరిటీ లో భాగంగా సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 / www.cybercrime.gov.in ఏదైన సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే బాధితులు వెంటనే సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 కి కాల్ చేసి / www.cybercrime.gov.in లో సమాచారం ఇవ్వాలి, ప్రజలకి టోల్ ఫ్రీ నెంబర్ పై పూర్తి అవగాహన కల్పించేలా పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలలో/పట్టణాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ భాదితులు 1930 కి ఫిర్యాదు చేసిన తర్వాత సంబంధిత ఫిర్యాధు పోలీస్ స్టేషన్ లోని ఎన్.సి.ఆర్.పి లోకి వస్తుంది అప్పుడు స్టేషన్ లోని సైబర్ వారియర్ వారి ఫిర్యాదును చూసి భాదితునికి కాల్ చేసి జరిగిన నేరం పై పూర్తి వివరాలు తెలుసుకొని వారి ఫిర్యాదు గురుంచి స్టేషన్ హౌస్ ఆఫీసర్ కి తెలియజేసీ, నిందితుని ఖాతా హోల్డ్ అయితే వెంటనే ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయించాలి. సైబర్ క్రైమ్ లలో డబ్బులు పోగొట్టుకున్న భాదితులకు తిరిగి డబ్బులు కోర్టు ద్వారా ఇప్పించడం జరుగుతుంది. భాదితులు సైబర్ క్రైమ్ జరిగిన తర్వాత వెంటనే 1930 / www.cybercrime.gov.in ఫిర్యాధు చేసిన సందర్బంలో నిందితుని బ్యాంక్ ఖాతా హోల్డ్ చేయవచ్చు. అదేవిధంగా నిందితుని ఖాతాలో ఉన్న బాధితుని యొక్క డబ్బును కోర్టు ద్వారా అతనికి చెరవేసేలా సైబర్ వారియర్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇతర రాష్ట్రాల జైల్ లో ఉన్న మన కేసులకు సంబంధించిన నిందితులను తెలంగాణ సైబర్ క్రైమ్ బ్యూరో వారి సమన్వయంతో పీటీ వారంట్ పై అరెస్ట్ చేయడం. ఈ శిక్షణా కార్యక్రమంలో శ్రీరాంపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి రాజు, చెన్నూరు టౌన్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు, చెన్నూర్ రూరల్ సీఐ విద్యా సాగర్, సిసిఆర్బి ఇన్స్పెక్టర్ బాబురావు, ఎస్ఐ వెంకట్, ఐటీ కోర్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ రాము, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News