Friday, April 11, 2025
Homeఆంధ్రప్రదేశ్Aluru: నిరుపేదల పాలిట రాక్షసుడు బాబు

Aluru: నిరుపేదల పాలిట రాక్షసుడు బాబు

నిరుపేదల పాలిట చంద్రబాబు పెద్ద రాక్షసుడన్నారు గుమ్మనూరు నారాయణ. ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గుమ్మనూరు నారాయణ మండల కన్వీనర్ వీరేష్ మాట్లాడుతూ రాజధాని అమరావతిలో ఒక సెంట్ భుమిని ఇల్లు లేని నిరుపేదలకు పంపిణి చెయ్యడం జీర్ణించుకోలేని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆ సెంట్ స్థలాన్ని శ్మశానం తో పోల్చడం చాలా దారుణం అన్నారు. గతంలో 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏ ఒక్క పేదవాడికి ఇల్లు కాదు కదా ఒక సెంట్ స్థలం కుడా ఇవ్వలేని ఈయన ఇలాంటి మాటలు మాట్లాడడం దారుణమన్నారు. అక్కచెల్లమ్మలకు 33 లక్షల ఇళ్లపట్టాలు ఇచిన జగనన్నను విమర్శించడం తగదు …పేదలను అవమానిస్తున్న చంద్రబాబుకు బుద్ధిచెప్పాలని అయన అన్నమాటలు వెనక్కి తీసుకోవాలని డిమండ్ చెస్తూ అలూరు పట్టణంలో అంబెడ్కర్ కుడలి నందు కళ్ళకు గంతలు కట్టుకుని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి అలూరు వైస్సార్సీపీ, మార్కెటు యార్డు వైస్ చైర్మన్ ఈరన్న, హనుమయ్య, సొసైటీ చైర్మన్ శ్రీనివాసులు సీనియర్ నాయకులు మదన్న గంగాధర్ రెడ్డి ,శ్రీరాములు రామాంజి, గౌడప్ప, దేవిరెడ్డి సుదారెడ్డి, గుండయ్య గోవింద్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News