Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandyala: నాయకుల మౌనంతోనే సీమకు అన్యాయం

Nandyala: నాయకుల మౌనంతోనే సీమకు అన్యాయం

రాజకీయ నాయకుల మౌనం వహించడంతోనే రాయలసీమకు అన్యాయం జరుగుతుందని, చెవుల్లో సీసం పోసుకున్నారని రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. రాయలసీమ నేతలపై నిప్పులు చెరిగారు. నంద్యాల లో పాత్రికేయుల సమావేశంలో రాయలసీమ నేతల చేతగాని తనంతో రాయలసీమ అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బైరెడ్డి మాట్లాడుతూ రాజకీయ నాయకుల మౌనంతోనే రాయలసీమకు అన్యాయం జరుగుతుందని, చెవుల్లో సీసం పోసుకోవడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలో అప్పర్ భద్ర డ్యామ్ కడుతున్నా, సంగమేశ్వరం వద్ద తీగెల వంతెన బదులు బ్రిడ్జి కం బ్యారేజ్ కోసం రాయలసీమ నాయకులు మాట్లాడకపోవడం దురదృష్టకరమని అన్నారు. రాయలసీమకు ప్రధాన శత్రువులు రాజకీయ నాయకులు, సినీ పరిశ్రమ అన్నారు. 52 నియోజకవర్గాల్లో సంతకాల సేకరణకు అందరూ ఆదరిస్తున్నారని అన్నారు. లక్ష మంది సంతకాలు చేసి మద్దతు తెలిపారని పేర్కొన్నారు. రాయలసీమలోని కడప, కర్నూల్, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ప్రజలు అసంతృప్తితో ఉన్నారని అన్నారు. తీగెల వంతెన ఏర్పాటు చేస్తే సెల్ఫీలు, సినిమా షూటింగులకు మాత్రమే పనికి వస్తుందని అన్నారు. బ్రిడ్జి కం బ్యారేజ్ నిర్మస్తే 60 టీఎంసీ ల నీరు నిలువచేస్తే రాయలసీమ ప్రాంతవాసులకు నీటి సమస్య ఉండదని అన్నారు. కర్ణాటకలో అప్పర్ భద్ర డ్యామ్ నిర్మిస్తే రాయలసీమకు ఉరితాడులాంటిదని గమనించాలని అన్నారు. కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్ లో పూడికల వల్ల కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, రాయలసీమలో 4 జిల్లాలు తెలంగాణ లో కొన్ని ప్రాంతాల ప్రజలు నష్టపోతారని అన్నారు.కర్నూల్ లోన్ ఎస్టీబిసి కళాశాలలోనే నష్టపోయామని గుర్తుచేశారు.1952 లో జవహర్ లాల్ నెహ్రు కర్నూల్ లోని ఎస్టీబిసి కళాశాలలోనే కర్నూల్ రాజధానిగా ప్రకటించారని,కేవలం మూడేళ్లకే రాజధానిని తరలించుకుపోతున్న అడిగిన నాధుడే లేదన్నారు.అప్పర్ భద్ర కడుతున్నా,బ్రిడ్జ్ కం బ్యారేజ్ కట్టకపోయినా,రిజర్వాయర్లు కట్టకపోయినా,రాజధాని తరలిపోతున్నా నేతలకు కావాల్సింది ఓట్లు,పదవులు తప్ప రాయలసీమ ప్రజల కష్టాలు తెలియవని ఎద్దేవా చేశారు. స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు అవుతున్న నేతల మౌనంతో మోసపోతున్నామన్నారు.న్యాయ రాజధాని పేరుతో న్యాయవాదులనే మొసంచేసిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.కృష్ణా బోర్డ్ విశాఖపట్నం లో పెట్టినా అడిగే దమ్ము నాయకులకు లేదన్నారు. రాయలసీమలో ప్రాజెక్టులు, ఐటి, పొలాలకు నీళ్లు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక వలస కూలీలు,నిరుద్యోగులు ఇతర ప్రాంతాలకు వెళ్లి హోటల్స్ లో కప్పులు కడుక్కునే దుస్థితికి నేతలే కారణమన్నారు.జాతీయ ప్రాజెక్టులు రాయలసీమకు ఎందుకురావడం లేదో నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంటులో డివిజన్ బిల్లు పాస్ చేసింది వట్టిమాటలేనా అని ప్రశ్నించారు.పార్లమెంట్ ను ఎలా నమ్మాలో అర్థం కాని పరిస్థితి అన్నారు. రాయలసీమలో ఖనిజ సంపదనను దోచుకుపోతున్నారని పేర్కొన్నారు.తిరుమలలో విలువైన సొత్తు కనపడకపోయిన ప్రశ్నించేవారు లేరన్నారు.రాయలసీమలో వేమన,త్యాగయ్య,అన్నమాచార్యులు పుట్టినగడ్డలో రాజకీయ నాయకుల చేతకాని తనంతో నాశనమైందని అన్నారు.సినీ పరిశ్రమ వారి స్వలాభం కోసం రాయలసీమ వాసుల బాంబులు,కత్తులు,హత్యలు,రక్తపాతలు జరుగుతాయని సినిమాల్లో చూపించడం ఒకరకంగా నష్టం వాటిల్లిందని అన్నారు.రాయలసీమ సమస్య కోసం త్వరలో ఢిల్లీ లోని గల్లీ, గల్లీల్లో జై రాయలసీమ నినాదాలు చేస్తామని అన్నారు. ప్రత్యేక రైళ్లలో వేలాది మందితో ర్యాలీ చేపడతామని అన్నారు. రాయలసీమ బాగుకోసం రాజకీయనాయకులు ఇప్పటికైనా గళం విప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్టీరింగ్ కమిటీ సభ్యులు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News