Thursday, September 19, 2024
Homeచిత్ర ప్రభMovies: ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ కాబోయే తెలుగు సినిమాలివే..

Movies: ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ కాబోయే తెలుగు సినిమాలివే..

- Advertisement -

Movies : ప్రస్తుతం సంక్రాంతి వరకు స్టార్ హీరోల సినిమాలు ఏమి లేకపోవడంతో చిన్న సినిమాలు, మీడియం సినిమాలు థియేటర్స్ కి క్యూ కట్టాయి. దీంతో ఈ వారం దాదాపు 10 సినిమాల దాకా రిలీజ్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా డిసెంబర్ 9నే రిలీజ్ అవుతున్నాయి. ఈ వారం తెలుగులో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..

బ్ర‌హ్మానందం, కలర్స్ స్వాతి, స‌ముద్ర‌ఖ‌ని, శివాత్మిక రాజ‌శేఖ‌ర్, రాహుల్ విజ‌య్, నరేష్‌ అగస్త్య, దివ్య శ్రీపాద ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తున్న ‘పంచతంత్రం’ సినిమా డిసెంబర్‌ 9న రిలీజ్ కానుంది.

సత్యదేవ్ హీరోగా తమన్నా, మేఘ ఆకాష్, కావ్య శెట్టిలు హీరోయిన్స్ గా తెరకెక్కిన గుర్తుందా శీతాకాలం సినిమా అనేక సార్లు వాయిదా పడి డిసెంబర్ 9న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాని కన్నడ సూపర్ హిట్ లవ్ మాక్ టైల్ కి రీమేక్ గా తెరకెక్కించారు.

విశ్వక్‌సేన్‌, ఆయేష్‌ఖాన్‌, ప్రియ వడ్లమాని, చైతన్యరావు, వికాస్‌ వశిష్ట ప్రధానపాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘ముఖచిత్రం’ డిసెంబర్ 9న థియేటర్స్ లోకి రానుంది. కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్ ఈ సినిమాకి కథ, కథనం, మాటలు అందించాడు.

త్రిగుణ్, మేఘా ఆకాష్‌ జంటగా, సీనియర్ హీరోయిన్ మధుబాల ముఖ్యపాత్రలో నటించిన ‘ప్రేమదేశం’ సినిమా డిసెంబర్ 9న రిలీజ్ కానుంది.

అప్సరా రాణి, నైనా గంగూలీ మెయిన్ లీడ్స్ లో రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘డేంజరస్‌’ సినిమా కూడా అనేకసార్లు వాయిదా పడి డిసెంబరు 9న విడుదల కానుంది.

యష్‌ పూరి, స్టెఫీ పటేల్‌ జంటగా సూపర్‌ గుడ్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌పై రూపొందిన 94వ సినిమా ‘చెప్పాలని ఉంది’-‘ఒక మాతృభాష కథ’ సినిమా డిసెంబర్ 9న రిలీజ్ అవ్వబోతుంది.

రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్లుగా బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ‘లెహరాయి’ సినిమా డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకి వస్తుంది.

తల్లాడ సాయి కృష్ణ దర్శకత్వం వహిస్తూ, హీరోగా నటించిన ‘నమస్తే సేట్‌ జీ’ సినిమా డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకి వస్తుంది.

సాయి రోనక్, అంకిత సాహా, బిస్మినాస్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘రాజయోగం’ సినిమా డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకి రానుంది.

దేశంలోనే అతి పెద్ద లాజిస్టిక్‌ కంపెనీల్లో ఒకటైన వీఆర్‌ఎల్‌ వ్యవస్థాపకుడు విజయ్‌ శంకేశ్వర్‌ బయోపిక్‌ గా తెరకెక్కిన ‘విజయానంద్‌’ సినిమా డిసెంబర్ 9న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. ఈ సినిమా దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ భారీగా చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News