Sunday, November 10, 2024
HomeతెలంగాణMahabubabad: పోలీసులకు సేఫ్టీ గేర్

Mahabubabad: పోలీసులకు సేఫ్టీ గేర్

వేసవి తాపం నుండి ట్రాఫిక్ సిబ్బంది రక్షణ పొందేందుకు ఎండ తీవ్రత నుండి కాపాడే సన్/కూలింగ్ గ్లాసెస్, నీరు చల్లదనం ఉంచే ధర్మొస్ వాటర్ బాటిళ్లు, ఎండకు రక్షణ కవచం గా గొడుగులను మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ శుక్రవారం మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో అందించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ట్రాఫిక్ సిబ్బంది నిత్యం మండుటెండలో విధులు నిర్వహించడం చాలా కష్టంగా ఉంటుందని, తీవ్రమైన ఎండలలో దుమ్ము, ధూళి లెక్కచేయకుండా విధులు నిర్వర్తించే వారికి వేసవి తాపం నుండి స్వీయ రక్షణ చాలా అవసరమని, ఎండకు డీహైడ్రేషన్ కాకుండా నీరు బాగా తాగాలని, వడ దెబ్బ వంటి ప్రమాదకర పరిస్థితులకు లోను కాకుండా ORSL, నిమ్మ రసం, మజ్జిగ లాంటి ద్రవాలు సేవించాలని మరియు వేసవి కాలంలో అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రవాణా సాఫీగా సాగుటలో ట్రాఫిక్ పోలీసుల పాత్ర అత్యంత కీలకమైనదని, వేసవిలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ప్రజలకి మెరుగైన సేవలందించాలని, విధి నిర్వహణలో ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ జోగుల చెన్నయ్య, మహబూబాబాద్ ట్రాఫిక్ ఎస్ఐ భద్రునాయక్, తొర్రూరు ట్రాఫిక్ ఎస్ఐ రాంజీ నాయక్ ,ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News