Thursday, September 19, 2024
Homeచిత్ర ప్రభTamannaah: పెద్దా, చిన్న ఏ హీరోతోనైనా నేను రెడీ అంటున్న మిల్కీ

Tamannaah: పెద్దా, చిన్న ఏ హీరోతోనైనా నేను రెడీ అంటున్న మిల్కీ

- Advertisement -

Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికి తెలుగు, తమిళ్, బాలీవుడ్ లో సినిమాలు చేస్తుంది. ఇప్పటికి కూడా ఈ మిల్కి బ్యూటీకి గ్యాప్ లేకుండా వరుస అవకాశాలు ఉన్నాయి. త్వరలో సత్యదేవ్ సరసన గుర్తుందా శీతాకాలం సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. కన్నడలో సూపర్ హిట్ అయిన లవ్ మాక్‌టైల్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది ఈ సినిమా.

తమన్నాతో పోలిస్తే సత్యదేవ్ స్టార్ ఏం కాదు. సత్యదేవ్ కెరీర్ మొదట్లో ఉన్నప్పుడే తమన్నా స్టార్ గా ఉంది. దీంతో సత్యదేవ్ పక్కన తమన్నా చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా స్టార్ హీరోయిన్స్ తమ కన్నా తక్కువ రేంజ్ ఉన్న హీరోస్ తో అంత తొందరగా చేయరు. ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరితో సినిమాలు చేసేసిన తమన్నా సత్యదేవ్ పక్కన చేయడమేంటి అని అనుకున్నారు.

ఇదే విషయాన్నీ ప్రమోషన్స్ లో తమన్నాని అడిగారు. దీనికి తమన్నా స్పందిస్తూ.. ”నేను పెద్ద హీరో, చిన్న హీరో అని చూడను. నాకు కథ నచ్చితే ఎవరితోనైనా చేస్తాను. నేను చేసే సినిమా ఆడియన్స్ కి నచ్చాలని అనుకుంటాను. సత్యదేవ్ ఉగ్రరూపస్య సినిమా చూశాను. అతను చాలా మంచి యాక్టర్. అతనితో కలిసి నటించాలనుకున్నాను, అది ఈ సినిమాతో తీరింది. భాషతో సంబంధం లేకుండా మంచి కథ ఉంటే నా సీనియార్టీని పక్కన పెట్టి ఏ హీరోతోనైనా చేస్తాను” అని తెలిపింది. ఇలా అంటే అవకాశాలకు ఢోకా ఉండదు అంటున్నారు సినీ వర్గాలు. అందుకే 17 ఏళ్ళైనా ఇంకా అవకాశాలు వస్తున్నాయి తమన్నాకి అని చెప్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News