పెన్ పహాడ్ మండలంలో మంత్రి జగదీష్ రెడ్డికి బ్రహ్మరథం పట్టారు. అభిమాన నాయకుడి కర స్పర్శ కోసం జనం బారులు తీరారు. కాళేశ్వరం జలాలు అందించిన నేతను కలుసుకుని అభిమానం చాటు కునేందుకు బారులు తీరారు. కాన్వాయ్ నీ అందుకోవడం కోసమే అన్నట్లు రైతాంగం పరుగులు పెట్టారు.ఇవి శుక్రవారం రోజున సూర్యాపేట నియోజక వర్గ పరిధిలోని పెన్ పహాడ్ మండలంలో మంత్రి జగదీష్ రెడ్డి పర్యటనలో చోటు చేసుకున్న ఉదంతాలు. మండల పరిధిలోని చెట్ల ముకుందాపురం గ్రామంలో కుటుంబ సభ్యులను కొలోయిన పార్టీ కార్యకర్త ను పరామర్శించేందుకు గాను మంత్రి జగదీష్ రెడ్డి వస్తున్నాడన్న సమాచారంతో దారి పొడువునా ఉన్న న్యూ బంజారా హిల్స్ , చిన గార కుంట, పెద్ద గార కుంట, చిన సీతారాం తండా లలో ఊరు వాడ ఏకమై అభిమాన నేత కాన్వాయ్ నీ ఆపి మరి అభిమానం చాటుకున్నారు.
పచ్చని పొలాలతో పైరు పంటలు సుభిక్షంగా ఉన్నాయి అంటే అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన కాళేశ్వరం జలాలు అంటూ మంత్రి జగదీష్ రెడ్డితో జరిగిన మాటా మంతి లో రైతులు పేర్కొన్నారు.ఉండనే ఉండదనుకున్న కరెంట్ పోనే పోదు అనే కాడికి తీసుకొచ్చిన ఘనత బి అర్ యస్ ప్రభుత్వానిదే నంటూ కొనియాడారు. అన్నీ విన్న మంత్రి జగదీష్ రెడ్డి ప్రజల అభిమానానికి స్పందిస్తూ చిరునవ్వుతో పలకరించిన తీరుతో అయా గ్రామాల ప్రజలు పరవశించి పోయారు. సెల్ఫీ ల కొసం విద్యార్థి యువత పోటా పోటీగా ముందుకు వచ్చిన తీరు అచ్చేర్వొందింది. మొత్తం మీద కార్యక్రమం ఏదైనా అభిమాన నేత వస్తున్నాడని తెలుసుకున్న ప్రజలు దా రిపొడువునా నీరాజనం పలికారు. న్యూ బంజారా హిల్స్ తండా లో క్రికెట్ కిట్ కావాలి అంటూ అక్కడి యువత అడిగిందే తడవుగా అప్పటికప్పడే తెప్పించి అందించిన తీరుకు ఆ యువత లో ఆనందం నింగి నంటెల చేసింది.