Thursday, September 19, 2024
Homeహెల్త్Coconut water for dandruff: కొబ్బరి నీళ్లతో చుండ్రు పోతుంది

Coconut water for dandruff: కొబ్బరి నీళ్లతో చుండ్రు పోతుంది

వేసవిలో కొబ్బరినీళ్లు తాగితే పొందే సాంత్వన ఎంతో. అందులోని పోషక విలువలు శరీరానికి ఇన్స్ స్టంట్ ఎనర్జీని ఇస్తాయి. ప్రక్రుతి సిద్ధమైన కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికే కాదు జుట్టుకు, చర్మానికి కూడా ఎన్నో అందచందాలను చేకూరుస్తాయి. చక్కెర డ్రింకులు, కార్బోహైడ్రేటెడ్ డ్రింకుల కన్నా కూడా కొబ్బరినీళ్లు శరీరానికి ఆరోగ్యకరమైన శక్తిని అందిస్తాయంటున్నారు వైద్య నిపుణులు. కొబ్బరినీళ్లు తాగితే ఎసిడిటీ తగ్గుతుంది. జీర్ణక్రియ బాగా పనిచేస్తుంది. కడుపులో పోట్లను, గ్యాసు సమస్యను తగ్గిస్తుంది. అంతేకాదు కొబ్బరి నీళ్లు గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదని వైద్యులు చెప్తున్నారు.

- Advertisement -

చర్మం, శిరోజాల ఆరోగ్యానికి కొబ్బరినీళ్లు అందించే ప్రయోజనాలు ఎన్నో. చర్మానికి కావలసినంత హైడ్రేషన్ ని కొబ్బరినీళ్లు అందిస్తాయి. ఫలితంగా పొడిచర్మం, దురద, ఇరిటేషన్ వంటి సమస్యలు తలెత్తవు. పైగా కొబ్బరి నీళ్లలో కూలింగ్ ఎఫెక్టు బాగా ఉంటుంది. శరీరానికి కావలసిన సోడియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్లను పుష్కలంగా ఇది అందిస్తుంది. కొబ్బరినీళ్లు తాగడం వల్ల చర్మం మెరుపును సంతరించుకుంటుందని పోషకాహారనిపుణులు కూడా చెప్తున్నారు. ఇందులో విటమిన్ సి ఉండడంతో పాటు యాంటాక్సిడెంట్లు కూడా ఉండడం వల్ల కొల్లాజెన్ బాగా ఉత్పత్తి అవుతుంది. దీంతో చర్మం ఎలాస్టిసిటీ మెరుగుపడడంతో పాటు చర్మం పట్టులా మ్రుదువుగా ఉండి మెరుస్తుంది. ఆరోగ్యంగా ఉంటుంది. కొబ్బరినీళ్లల్లో సిటోకినిన్స్ అనే కాంపౌండ్ ఉంది. ఇందులో యాంటీ ఏజింగ్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే యంగ్ గా కనిపించాలనుకుంటే నిత్యం కొబ్బరినీళ్లు తాగితే మంచిదని బ్యూటీ నిపుణులు చెప్తున్నారు. యాక్నేని సైతం కొబ్బరినీళ్లు నివారిస్తాయి. శరీరంలోని విష పదార్థాల
కారణంగా మొటిమలు, యాక్నే, ఇతర చర్మ సమస్యలు తలెత్తుతుంటాయి. శరీరంలోని అలాంటి విషతుల్యమైన పదార్థాలను కొబ్బరినీళ్లు బయటకు పోగొడతాయి. కొబ్బరినీళ్లల్లో యాంటీబాక్టీరియల్, యాంటివైరల్ సుగుణాలు కూడా ఉన్నాయి. వీటితో శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఫ్రీరాడికల్ డ్యామేజ్ నుంచి చర్మాన్ని కొబ్బరినీళ్లు పరిరక్షిస్తాయి. కొబ్బరినీళ్లల్లో ఉండే పొటాషియం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. ఈ నీళ్లల్లో యాంటాక్సిడెంట్లతో పాటు లారిక్ యాసిడ్ ఉంది. అలాగే బి విటమిన్స్, మెగ్నీషియం ఉన్నాయి. ఇవి శిరోజాలను కుదుళ్ల నుంచి ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. జుట్టు కుదుళ్లను ద్రుఢం చేస్తాయి. కొబ్బరి నీళ్లను తాగడంతో పాటు వెంట్రుకలపై వాటిని అప్లై చేసుకోవడం వల్ల కూడా ఎంతో లాభం ఉంది. కొబ్బరినీళ్లు మాడుకు తగినంత తేమని అందిస్తుంది. చుండ్రును నివారిస్తుంది. మాడు పొడిబారడాన్ని నియంత్రిస్తుంది. అంతేకాదు వెంట్రుకలు సహజంగా మెరిసేలా చేస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News