Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: మరింత మెరుగైన వైద్య సేవలు ఇవ్వాలి

Kurnool: మరింత మెరుగైన వైద్య సేవలు ఇవ్వాలి

ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు చేపట్టాలని నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యం వారిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కర్నూలు మెడికల్ కాలేజ్ ఆవరణంలోని న్యూ లెక్చర్ గ్యాలరీ నందు ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యంతో, ఆరోగ్య మిత్రలతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు అందాల్సిన మెరుగైన వైద్య సేవలు కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల నుండే కాకుండా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు కల్పిస్తూ వైద్య వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చారని కలెక్టర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ ఉద్దేశ్యంతో ఆరోగ్య శ్రీ మొదలుపెట్టిందో అందుకు సంబంధించిన నాణ్యమైన వైద్య సేవలు పూర్తి స్ధాయిలో ప్రజలకు అందించాలని 47 నెట్వర్క్ ఆస్పత్రుల యాజమాన్యలను, ఆరోగ్య మిత్రలను కలెక్టర్ అదేశించారు. ఆసుపత్రులకు వచ్చిన ప్రజలతో మర్యాదగా మాట్లాడడమే కాకుండా వారికి అందించాల్సిన సేవలను అందించే విషయంలో అప్రమత్తంగా ఉండి అందించాలని సంబంధిత నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యం వారికి సూచించారు. నెట్వర్క్ ఆసుపత్రుల వారికి, అరోగ్య మిత్రలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకొని వస్తే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానని కలెక్టర్ పేర్కొన్నారు.
అక్షయ మిత్ర (టీబీ ముక్త్ భారత్) ద్వారా టీబీ పేషెంట్లకు అవసరమైన పోషకాహారాన్ని కల్పించే అవకాశం ఉందని, ఇక్కడ 2,300 మంది టీబీ పేషెంట్లు ఉన్నారని వారికి ఆరు నెలల పాటు పోషకాహార కిట్లు అందించే విధంగా 47 నెట్వర్క్ ఆసుపత్రులు వారికి వీలైనంత మందికి పోషకాహార కిట్లు మీ పేరు మీద వారికి ఇచ్చేలా చూడాలని నెట్వర్క్ ఆసుపత్రుల వారికి కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో ఆరోగ్య శ్రీ కో ఆర్డినేటర్ డా.రఘు, అడిషనల్ డిఎమ్ హెచ్ఓ డా.భాస్కర్, డిసిహెచ్ఎస్ డా.రాంజీ నాయక్, నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యం, అరోగ్య మిత్రలు తదితరుల పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News