Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్SP: హోంగార్డు కుటుంబానికి అండగా ఉంటాం

SP: హోంగార్డు కుటుంబానికి అండగా ఉంటాం

అంకిత భావంతో విధులు నిర్వర్తించే సిబ్బంది మరణించడం బాధాకరమని, వారి కుటుంబాలకు పోలీసు శాఖ అండగా ఉంటుందని కర్నూలు జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ పేర్కొన్నారు. కర్నూలు జిల్లా పోలీసు శాఖలో పనిచేస్తున్న హోంగార్డు మదన్ గోపాల్ అనారోగ్యంతో కర్నూలు సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతూ కోలుకోలేక మృతిచెందారు. హోంగార్డు భార్య నాగలక్ష్మమ్మకు కంట్రిబ్యూషన్ ఫండ్ కింద 2 లక్షల చెక్కును ఎస్పీ జి.కృష్ణకాంత్ అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ కృష్ణకాంత్ మాట్లాడుతూ మరణించిన సిబ్బంది కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకొని, ఏమైన సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హోంగార్డు కమాండెంట్ సదరన్ రీజియన్ ఎం. మహేష్ కుమార్, హోంగార్డు డీఎస్పీ బి.రాజకుమార్, హోంగార్డ్సు ఆర్ఐ బి. శివారెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News