నేరేడుచర్ల మండలంలోని పెంచికల్ దిన్నె గ్రామంలో పుచ్చలపల్లి సుందరయ్య 38వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి ఘన నివాళులర్పించారు, అనంతరం జరిగిన సభలో జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ సుందరయ్య భూస్వామ్య కుటుంబంలో పుట్టినప్పటికీ చిన్నతనం నుండే పేదలు పడుతున్న కష్టాలను చూశారని అన్నారు,కుల వివక్షత, శ్రమ దోపిడి వంటివి చూసి చలించిపోయారని,కొంతమందికి మాత్రమే తిండి, బట్ట, చదువు మరి కొంతమందికి ఎందుకు లేదని ఆనాడే ఆయన పసిగట్టారు, పాలకులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని తెలిసి ఆనాడే పాలేర్లందరినీ కూడగట్టి వ్యవసాయ కార్మిక సంఘం ఏర్పాటు చేశారన్నారు,పెత్తందారుల మీద పోరాటం కొనసాగించారని,సొంత కుటుంబంతోనే విబేదించిన గొప్ప నాయకుడు ప్రపంచ మానవాళికి దిశా నిర్దేశం కేవలం ఎర్రజెండా తోనే సాధ్యమని నమ్మిన వ్యక్తి సుందరయ్య అని కొనియాడారు, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరుగు పోరాటంలో కమ్యూనిస్టుల పాత్ర ఉంటుందన్నారు,
సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ మాట్లాడుతూ సుందరయ్య ఒక ఆదర్శవంతమైన వ్యక్తి అని కుల నిర్మూలన అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడన్నారు,నెల్లూరు జిల్లా అనిగండ్లపాడు గ్రామం లో 1936లో వ్యవసాయ కార్మిక సంఘం ఏర్పాటు చేశారని,తన ఊరిలోనే వ్యవసాయ కార్మికులు దోపిడీ గురవుతున్నారని, తెలుసుకొని తన ఊరు నుండే వ్యవసాయ కార్మిక సంఘం స్థాపించారు,వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఆయన పాల్గొన్నారని,దక్షిణ భారత దేశంలో సిపిఎం పార్టీ నిర్మాణంలో అగ్రగన్యుడని అన్నారు,ప్రజా సమస్యలు వెలికి తీసి ఉద్యమాలతో అధికారులకు పాలకుల దృష్టికి తీసుకెళ్లారని చెప్పారు,ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పారేపల్లి శేఖర్ రావు,సిపిఎం పార్టీ మండల కార్యదర్శి సిరికొండ శ్రీను, కొదమగుండ్ల నగేష్,కందగట్ల అనంత ప్రకాష్,అల్వాల శ్రీధర్,మర్రి నాగేశ్వరరావు,జీడిమెట్ల రవి, బొప్పన రాణమ్మ,పాలకూరి రాములమ్మ,కట్ట మధు,మామిడి నాగ సైదులు,చలసాని అప్పారావు, నందమూరి బాబురావు,సుంకరి వెంకటేశ్వరరావు,కర్నాటి మురళి, అరిబండి ప్రసాదరావు,పాతూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.